సెక్స్ డాల్‌తో పెళ్లి.. దూరం దూరంగా... ముద్దు కూడా నో, ఇదేమి వింత
పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు. అయితే డేట్/ గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొందరి ఆలోచనలు వినూత్నంగా ఉంటున్నాయి. హంకాంగ్‌కి చెందిన ఓ యువకుడు ఏకంగా సెక్స్ డాల్‌పై మనసు పారేసుకున్నాడు. అంతే కాదండోయ్ అందరీ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ బొమ్మనే ఎందుకు మనువాడవంటే.. తన గాధను చెప్పసాగాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. పదండి.

జి టియాన్రోంగ్..
హంకాంగ్‌కి చెందిన జి టియాన్రోంగ్ కాస్త డిఫరెంట్. 36 ఏళ్ల జి పేరంట్స్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే అతను మహిళలను పెళ్లి చేసుకునేందుకు మాత్రం నో చెబుతున్నాడు. ఇదివరకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ తనను పట్టించుకోవడం లేదని ఆయన భావించాడు. ఎప్పుడూ ఫోన్ చూడటంతో వారితో ఫ్రెండ్‌షిప్‌కి బై బై చెప్పేశాడు. ఇక బొమ్మలతో స్నేహం.. ప్రేమ సాగించి... చివరికీ పెళ్లి చేసుకున్నాడు.

సెక్స్ డాల్‌తో పెళ్లి
మోచీ అనే సెక్స్ డాల్‌ను జి పెళ్లి చేసుకున్నాడు. బొమ్మతో జరిగిన వివాహా వేడుకకు చాలా మంది అతిథులు కూడా వచ్చారు. తాను ప్రేమించిన మోచికి ఖరీదైన ఫోన్ కూడా గిప్ట్ ఇచ్చాడు. ఐ ఫోన్ 12 బహుమతిగా అందజేశాడు. వాస్తవానికి మోచి సెక్స్ డాల్.. ఇతర సెక్స్ డాల్‌లా దానితో కలిసేవారు. కానీ మోచీని మనసారా మనవాడిని జీ.. మాత్రం దూరంగా ఉంటున్నాడు. సెక్స్ కాదు కదా.. దాని బుగ్గలపై ముద్దు కూడా పెట్టుకోలేదట. ఎందుకంటే తన సున్నితమైన చర్మం ఎక్కడ పాడవుతుందో అని ఆందోళన చెందుతున్నాడు. జి ప్రేమ గురించి తెలిసిన నెటిజన్ల వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మనస్ఫూర్తిగా గడిపేందుకే వివాహం..
మోచీతో మనస్పూర్తిగా గడిపేందుకే వివాహం చేసుకున్నానని జి చెబుతున్నారు. తనకు ఇదివరకు ఉన్న గర్ల ప్రెండ్స్ వల్ల వారిపై విరక్తి కలిగిందని చెప్పారు. అందుకోసమే బొమ్మలపై ఆకర్షణ, ప్రేమ కలిగిందని చెప్పారు. జి చెబుతోన్న దానిని బట్టి.. ఆయనకు బొమ్మలపై గల ప్రేమ ఏంటో అర్థమవుతోంది. అయితే 2019లో కూడా జి సెక్స్ డాల్ కొనుగోలు చేశారు. రూ.1 లక్ష వెచ్చించి మరీ బై చేశారు.

వారు తన ముందు ఫోన్ వాడుతూ..
తనకు ఇదివరకు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ వల్ల విసిగిపోయానని చెప్పారు. వారు తనతో ఉన్న సమయంలో ఫోన్ చూసేవారు అని చెప్పారు. దీంతో తనకు చిరాకు కలిగేదని వివరించారు. కానీ మోచి మాత్రం విభిన్నం అని.. అదీ ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తుందని చెప్పారు. తనపై మనసు, దృష్టిసారిస్తోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జి.. చెప్పే అంశం కాస్త నిజమే. కానీ సమాజం మాత్రం కఠోర వాస్తవాలను అంగీకరించదు.












Click it and Unblock the Notifications