షాక్: 71 ఏళ్ళ వయస్సులో భర్త సాహసం, కొంపముంచింది (వీడియో)
71 ఏళ్ళ వయస్సులో కూడ తన కోరికను తీర్చుకోవాలనుకొన్నాడు. ఆ వయస్సులో కూడ సాహసం చేశాడు. అయితే అంతా సాపీగా సాగుతోందనుకొన్న సమయంలో 71 ఏళ్ళ రోగర్ హుస్సే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు.
బ్యాంకాక్: 71 ఏళ్ళ వయస్సులో కూడ తన కోరికను తీర్చుకోవాలనుకొన్నాడు. ఆ వయస్సులో కూడ సాహసం చేశాడు. అయితే అంతా సాపీగా సాగుతోందనుకొన్న సమయంలో 71 ఏళ్ళ రోగర్ హుస్సే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు. ఆయనను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వైఫల్యం చెందాయి.
అస్ట్రేలియాకు చెందిన రోగర్ హుస్సేకు పారా సెయిలింగ్ చేయాలనే కోరిక. ఈ విషయాన్ని తన భార్యతో ఎప్పుడూ చెప్పేవాడు. భార్యతో కలిసి ఆయన థాయ్‌లాండ్‌కు వచ్చారు. థాయ్‌లాండ్ బీచ్‌కు చేరుకోగానే పారాసెయిలింగ్ కోరిక తీర్చుకొనేందకు ఆయన ప్రయత్నించాడు.
సెయిలింగ్‌కు ముందు ఆయన రక్షణగా డ్రెస్ వేసుకొనే సమయంలో ఆయన ఎంతో నవ్వుతూ ఉల్లాసంగా కన్పించారు.ఆయన డ్రెస్ వేసుకొనే సమయంలో ఆయన భార్య వీడియో కూడ తీసింది. పారాసెయిలింగ్ శిక్షకుడితో కలిసి రోగర్ గగనతలంలో విహరించేందుకు బయలుదేరారు.
సముద్రంపై బోటు వేగంగా దూసుకువెళ్తుండగా వారు పారాసెయిలింగ్‌తో సముద్రంపై ఓ వంద అడుగుల ఎత్తులో దాదాపు 30 మీటర్ల ఎత్తులో తేలియాడుతున్నారు. అయితే అనుహ్యంగా రోగర్ అంత ఎత్తునుండి తాడు తెగిపోయి సముద్రంలో పడ్డారు.
ఆ వీడియో తీస్తున్న ఆయన భార్య షాక్‌కు గురైంది. రోగర్ ను కాపాడేందుకు వేగగా సముద్రంలోకి వెళ్ళారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ఆయన చనిపోయారు. శ్వాస ఆగిపోయిన కారణంగానే అతను చనిపోయినట్టు పోలీసులు చెప్పారరు. పారాసెయిలింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రోగర్ భార్యనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications