Video : బీఎండబ్ల్యూని ఈడ్చుకెళ్లిన రైలు.. సేఫ్‌గా బయటపడ్డ డ్రైవర్..

భూమి మీద నూకలు మిగిలి ఉంటే.. మృత్యువు వెంటపడి తరిమినా సరే బతికి బట్ట కట్టగలుగుతారు. అందుకు దీన్ని మించిన ఉదాహరణ లేదేమో. ఓ బీఎండబ్ల్యూ కారును రైలు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా సరే.. అందులోని డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని సౌత్ లాస్ ఏంజిల్స్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

స్థానిక మీడియా కేటీఎల్ఏ ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 11గంటల సమయంలో సౌత్ లాస్ ఏంజిల్స్‌లోని ఓ రైల్వే గేట్ వద్దకు బీఎండబ్ల్యూ కారు వచ్చింది. అప్పటికే రైల్వే గేట్ పడ్డప్పటికీ.. అందులోని డ్రైవర్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లాడు.

 Horrifying Footage Shows BMW Getting Crushed By Train

అదే సమయంలో అటుగా దూసుకొచ్చిన రైలు ఆ బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఇంత జరిగినా.. ఆ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఘటన అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. బుధవారం అతను డిశ్చార్జి అయ్యాడు.

అంత ప్రమాదం తర్వాత కూడా అతను ప్రాణాలతో బయటపడటం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని.. కానీ ప్రతీ ఒక్కరూ ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. రైల్వే ట్రాక్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని.. సిగ్నల్స్ తప్పకుండా పాటించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+