రహదారిపై సినీఫక్కీలో పోలీసుల ఛేజ్.. చివరికి ఘోర ప్రమాదం!

వాషిగ్టన్: అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో పోలీసులు ఓ నిందితుడి కారును సినీఫక్కీలో ఛేజ్ చేశారు. రహదారిపై కొన్ని కిలోమీటర్ల దూరం కొనసాగిన ఈ ఛేజింగ్‌లో చివరికి నిందితుడి కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా అక్కడి పోలీసులు విడుదల చేశారు. ఇందులో ఎరుపు రంగు ఎస్‌యూవీలో నిందితుడు పారిపోతుండగా.. వెనక పోలీస్ వాహనం వెంబడిస్తూ కనిపిస్తుంది.

అయితే నిందితుడు పోలీసులకు దొరకకుండా కొన్ని కిలోమీటర్లు తప్పించుకోగలిగాడు. కానీ ఓ చౌరస్తా వద్ద రెడ్ సిగ్నల్ పడడం అతడి కొంపముంచింది. కొన్ని క్షణాలపాటు ఆ చౌరస్తాలో తన కారును ఆపిన నిందితుడు పోలీసుల వాహనం సమీపించడంతో గాభరాపడి మళ్లీ కారును ముందుకురికిస్తాడు.

Horrifying head on crash between suspect fleeing police and innocent driver is caught on camera

ఆ తరువాత కాసేపటికే మరో కారుని ఢీకొడతాడు నిందితుడు. తెలుపు రంగు కారును తప్పించినప్పటికీ నలుపురంగు ఎస్‌యూవీని ఢీకొట్టేస్తాడు. దీంతో నిందితుడి కారుతోపాటు అతడు ఢీకొట్టిన ఎస్‌యూవీ ముందు భాగం కూడా ధ్వసం అవుతుంది.

ఈ ప్రమాదంలో ఎరుపు రంగు కారులోని నిందితుడికి స్వల్పగాయాలు కాగా, అతడు ఢీకొట్టిన ఎస్‌యూవీలోని మహిళ(47)కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదరు నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+