వామ్మో.. మిలిటరీ బేస్ ఇనుపకంచె ఎక్కిన మొసలి.. సోషల్ మీడియాలో హల్‌చల్
ఫ్లోరిడా : అదీ మిలిటరీ బేస్. అక్కడ సైనికులు శిక్షణ పొందుతుంటారు. కానీ వారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం కాస్త చిన్నగానే ఉంది. వారిపై దాడి చేసేందుకు నేరస్తులో, సంఘ విద్రోహ శక్తులో దూకలేదు. ఓ మొసలి బేస్ క్యాంపులోకి వెళ్లడం కలకలం రేపింది. మొసలి ఏంటీ .. బేస్ క్యాంపులోకి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా ? నమ్మడం లేదా ? అయితే కింద వీడియో చూడండి. చూశారా ... అవును ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ ట్రోల్ అవుతుంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో మిలిటరీ బేస్ క్యాంపు ఉంది. ఇక్కడ సైనికులు శిక్షణ పొందుతారు. వారిని సుశిక్షితులైన సోల్జర్స్‌గా తీర్చిదిద్దుతారు. కఠోర సాధన అనంతరం పోస్టింగ్ ఇస్తారు. జాక్‌సాన్ విల్లేలో గల నవల్ ఎయిర్ స్టేషన్ ఉంది. దాని చుట్టు పక్కల ఇనుపకంచె ఏర్పాటు చేశారు. అయితే శనివారం కొంచెం వర్షం పడుతుంది. దీంతో అటుగా వెళ్తున్న క్రిస్టినా స్టివర్ట్ నిశీతంగా గమనించారు. రోడ్డుపై నుంచి ఓ మొసలి దాటుకుంటూ వెళ్లింది. అక్కడే ఉన్న ఇనుప కంచె ఎక్కింది. దీంతో ఆశ్చర్య పోయినా క్ట్రిస్టినా .. మొసలి కంచె ఎక్కిన ఘటనను వీడియో తీశారు. అలా మొసలి కంచె ఎక్కి .. మిలిటరీ బేస్ క్యాంపులోకి చొచ్చుకెళ్లింది.

ఆ వీడియోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇనుప కంచెను దాటుతున్న మొసలి అంటూ ట్యాగ్ లైన్ పెట్టి మరీ పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాదాపు 3 లక్షల మంది చూశారు. ఆ వీడియో చూస్తుంటే భయమేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మీరు ప్లోరిడాకు కొత్తనా .. ఇక్కడే కొన్నేళ్ల నుంచి ఉంటున్నారా ? మీరు ఇక్కడ నీళ్లు చూశారా .. అయితే అందులో మొసలి కూడా ఉంటుందని అని కామెంట్లు పెడుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications