షాకింగ్: సెక్స్‌కు నో చెప్పిందని పొడిచి చంపేశాడు
లండన్: తనతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించిందనే కారణంతో తన ప్లాట్ మేట్, ప్రముఖ ఫ్యాషన్ బయర్ కాటి రూర్కేను పొడిచి చంపినట్లు గ్యారీ స్టీవెన్సన్ అంగీకరించాడు. లండన్‌కు చెందిన గ్యారీ స్టీవెన్సన్ అనే వ్యక్తి ఓ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు.
అతడు కాటి రూర్కే అని ఫ్యాషన్ బయర్‌తో బాగా చనువుగా ఉండేవాడు. గ్లాస్గోలోని క్రెయింగ్టాలో గల మింటో వీధఇలోని ఓ అపార్టుమెంటులో వారు ఉండేవారు. డిసెంబర్ 29వ తేదీన రాత్రి వారిద్దరి మధ్య తొలుత ఒక స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.

తనతో శృంగారంతో పాల్గొనాలని అతడు ఆమెను బలవంతం చేశాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో అతడు కోపంతో ఆమెను సుత్తితో పొడిచి అదే ప్లాట్‌లో పడేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆ రోజు జరిగిన వివరాలను అతను చెప్పాడు.
ఆ రోజు ఆమెను పొడిచానని, మూడుసార్లు పొడిచి ఉంటానని, పొడిచే ముందు చాలాసార్లు కొట్టానని, తమ మధ్య ఒప్పందం కుదరకపోయేసరికి నియంత్రణ కోల్పోయానని చెప్పాడు. ఆమెను కొడుతూ.. కొడుతూ.. చివరకు పొడిచేశానని చెప్పాడు.












Click it and Unblock the Notifications