భూమికి దగ్గరగా వచ్చిన ఇంటి సైజులోని ఆస్టరాయిడ్
లండన్: సాధారణ ఇంటి పరిణాంలో ఉన్న ఓ అరవై అడుగుల ఆస్టరాయిడ్ ఆదివారం భూమికి దగ్గరగా వచ్చిందని నాసా తెలిపింది. ఈ ఆస్టరాయిడ్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఈ ఆస్టరాయిడ్ పేరు ఆర్సీ 2014. ఇది న్యూజిలాండ్ దేశంలో భూమికి 40,000 వేల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది.
2013లో అంతే పరిణామం గల ఓ ఆస్టరాయిడ్ రష్యాలోని చెల్యబిస్క్ ప్రాంతంలో వచ్చినప్పుడు వెయ్యి మంది వరకు గాయపడ్డారు.

కాగా, ఆస్టరాయిడ్లు భూమికి దగ్గరగా రావడం వల్ల... వాటి పైన పరిశోధన చేస్తున్న వారికి ఆస్టరాయిడ్ల గురించి మరింత తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications