యెమెన్ మిలిటరీ క్యాంప్ పై హౌతీల దాడి.. 53 మంది మృతి.. 200 మందికి పైగా సీరియస్
సౌదీ అరేబియాపై యుద్ధం చేస్తున్నా హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ లోని ప్రభుత్వ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 53 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హౌతీల క్షిపణి దాడులకు సైనికుల శరీర భాగాలు వేరుగా పడి మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ మిలిటరీ క్యాంప్ పై హౌతీ దళాలు మూడు క్షిపణులను ప్రయోగించినట్లు స్పష్టం అవుతోంది.
ఇదే విషయాన్ని హౌతీలు ధృవీకరించారు. దాడులకు పాల్పడింది తామేనని పేర్కొన్నారు. దాడుల కారణంగా తొలుత 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజాగా 53 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని షబ్ వా ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ఫహద్ అల్ ఖలీఫీ స్పష్టం చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరింత సీరియస్ గా గాయపడిన వారిని మెరుగైన వైద్య సదుపాయం కోసం అక్కడి నుంచి ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో ఈ మధ్య కాలంలో ఇలాంటి భారీ ఘటన జరగడం ఇదే తొలిసారని యెమెన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఇటీవలికాలంలో పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం తీవ్రతరం అయిన నేపథ్యంలో సౌదీ అరేబియాపై హౌతీల దాడులు పెరిగాయి. ఇక తాజాగా హౌతీల దాడుల్లో గాయపడిన సైనికులు మరికొద్ది రోజుల్లో స్థానిక ప్రాంతాల రక్షణ కోసం ర్యాపిడ్ ఇంటర్ వెన్షన్ ఫోర్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. సైనికులంతా ట్రైనింగ్ కోసం లైనప్ చేస్తున్న క్రమంలో వారిపై క్షిపణులు కురిపించాయి హౌతీ దళాలు. ఇక యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్ షిప్ కౌన్సిల్ హెడ్ రషద్ అల్ అలిమీ ఈ ఘటనపై మాట్లాడుతూ హౌతీ దాడులు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. సైనికుల దాడికి ధీటుగా ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
