డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా రూపొందించిన డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. అయితే గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం తగిన సంప్రదింపులు జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కోరుతూ రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి తాజాగా మరో లేఖ రాశారు. దీనిపై స్పందిస్తూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఇవాళ ఆయనకు లేఖ రాశారు.

ప్రధానికి రాసిన లేఖకు స్పందనగా.. ఈ అంశంపై ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి, వాస్తవాలను అధికారికంగా తెలియచేయడానికి తాను ఈ లేఖ రాస్తున్నట్లు రిజిజు తెలిపారు. ఇందులో మొదటిది 2026 ఆగస్టు 13న పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటి నుంచి 64 రోజులు గడిచినా పార్లమెంటును అధికారికంగా ప్రొరోగ్ చేయలేదన్న వాదనపై స్పందించారు. సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత, నిర్దిష్ట కాలవ్యవధిలోగా సభను ప్రొరోగ్ చేయాలని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదన్నారు. కొంతకాలం వరకు సభను ప్రొరోగ్ చేయకపోవడం వల్ల మాత్రమే రాజ్యాంగపరమైన లేదా విధానపరమైన అక్రమం జరిగినట్లు భావించలేమన్నారు.

Kiren Rijiju Counters Kharge s Demand for All-Party Meet Cites Centre s Earlier Consultations
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!
ఈసీల చట్టంపై జగన్ ఒత్తిడి వెనుక? 2018 సీన్ రిపీట్ కాబోతోందా ? కానీ ఈసారి..!

గతంలోనూ పార్లమెంటు సమావేశాలు సుదీర్ఘకాలం పాటు ప్రొరోగ్ చేయకుండా ఉన్న అనేక సందర్భాలు ఉన్నాయని కిరణ్ గుర్తుచేశారు. ఈ వ్యవధి 87 రోజుల వరకు కూడా కొనసాగిందన్నారు.అలాగే రెండో అంశం నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లును పరిశీలించి ఆమోదించేందుకు ప్రతిపక్షాల మద్దతు, సహకారాన్ని ప్రభుత్వం నిరంతరం కోరుతోందని గుర్తుచేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వం పలుమార్లు సంప్రదించిందని, ఈ విషయంపై తాను మార్చి 16న, మార్చి 26న, ఏప్రిల్ 12న లేఖలు రాసినట్లు ఖర్గేకు ఆయన గుర్తుచేశారు. ఇందులో లిఖితపూర్వక సమాచారంతో పాటు, ఈ అంశంపై వ్యక్తిగతంగా కూడా మీతో చర్చించి, మీ మద్దతు, సహకారాన్ని కోరానన్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా వ్యక్తిగతంగా కలిసి ఈ అంశంపై చర్చించి, సహకారాన్ని కోరానన్నారు.

Kiren Rijiju Counters Kharge s Demand for All-Party Meet Cites Centre s Earlier Consultations
మారిపోతున్న లెక్కలు- ఆత్మరక్షణలో కేంద్రం..! ఫలించని మైండ్ గేమ్ ?
మారిపోతున్న లెక్కలు- ఆత్మరక్షణలో కేంద్రం..! ఫలించని మైండ్ గేమ్ ?

పలుమార్లు విజ్ఞప్తి చేసినా చర్చల కోసం కాంగ్రెస్ తేదీలను కేటాయించలేదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ), ఏఐఎంఐఎం, బిజూ జనతాదళ్ వంటి పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ఈ చట్టానికి మద్దతుగా విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించడం, చర్చలకు మార్గం సుగమం చేయడం ఈ సంప్రదింపుల ఉద్దేశమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే చర్చల కోసం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, సంప్రదింపులు జరపాలన్న డిమాండ్‌ను పదేపదే ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే చేపట్టిన సంప్రదింపులను పరిగణనలోకి తీసుకోకుండా అదే డిమాండ్‌ను మళ్లీ మళ్లీ చేయడం కంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయడం ద్వారా అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండటం ప్రభుత్వ విధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో కీలకమైన చట్టాల రూపకల్పన, ఆమోద ప్రక్రియను అడ్డుకోదని ఆశిస్తున్నట్లు రిజిజు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+