Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు: కీలక బిల్లుల ఎంట్రీ

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament's Winter Session)కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు సెలవులు మినహాయించి 15 రోజులపాటు ఉభయసభలు సమావేశమవుతాయన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వశాఖకు అందాయి.

Parliaments Winter Session To Begin On December 4: Pralhad Joshi

ఈ నేపథ్యంలో శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం ఉంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వీటితోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో వీటిని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు, దేశంలోని ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ చివరి వరకు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+