డీలిమిటేషన్ బిల్లు పై కేంద్రం అనూహ్య నిర్ణయం, కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్..!!

కేంద్రం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కొంత కాలంగా వాయిదా పడుతున్న మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లు పైన కసరత్తు వేగవంతం చేసింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్దం అవుతోంది. దీపావళికి ముందే సమావేశాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సమయంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖ కీలకంగా మారుతోంది.

కేంద్రం మరోసారి డీలిమిటేషన్ బిల్లు పైన పావులు కదుపుతోంది. పార్లమెంట్ లో ఈ సారి పూర్తి సంఖ్యా బలం సిద్దం చేసుకుని ఈ బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. దీపావళికి ముందే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఈ బిల్లులను ఆమోదం పొందేలా వ్యూహ రచన చేస్తోంది. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాసారు.

కేంద్రం అనూహ్య నిర్ణయం..! త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ?
కేంద్రం అనూహ్య నిర్ణయం..! త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ?
Kharge Writes to PM Modi Over Delay in Proroguing Parliament s Monsoon Session here the details

కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చేసిన విధంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో బలవంతంగా ఆమోదింపజేసుకునే ప్రయత్నం మరోసారి చేయొద్దని ప్రధానిని కోరారు.

 ఏపీలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు, కేంద్రం ఆమోదం..!!
ఏపీలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు, కేంద్రం ఆమోదం..!!

ఈ లేఖలో ఖర్గే కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి రాజకీయ పార్టీకి తమ మధ్య, ఒకదానితో ఒకటి మరియు ఇతర అన్ని భాగస్వాములతో చర్చించడానికి సరిపడా సమయం ఉండాలని సూచించారు. ని ఆయన జోడించారు. కేంద్రం మళ్లీ పార్లమెంట్ ద్వారా దూరప్రభావం కలిగించే రాజ్యాంగ సవరణ బిల్లును బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించ వద్దు, మీరు ముందుగా చేసినట్లుగా, అది తనకు వీగిపోయిందని ఖర్గే గుర్తు చేసారు. ఇప్పుడు ప్రతిపక్షాలతో సైతం చర్చించిన తరువాతనే నిర్ణయం ఉండాలని ఖర్గే అభిప్రాయపడ్డారు. కాగా, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఖర్గే లేఖ రాయటం ఇప్పుడు రాజకీయం గా కీలక మలుపుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+