ఇలా చేస్తే మీరు అమెరికాలో ట్రంప్ బారి నుంచి బయటపడవచ్చట
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా చర్యలతో ముస్లిం దేశాలలో దడ మొదలైంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ట్రంప్ బారిన పడకుండా ఉండొచ్చో పలు దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
ఉగ్రవాదులను కట్టడి చేసే విషయంలో.. చెప్పిన మాట మేరకు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేయడంతో.. ముస్లిం దేశాలలో దడ మొదలైంది. ట్రంప్ దెబ్బకు జడుసుకున్న పాక్ ప్రభుత్వం ముంబై దాడుల వ్యూహకర్త హఫీజ్ సయీద్ ను సోమవారం రాత్రి ఆకస్మికంగా గృహ నిర్బంధంలోకి తీసుకుంది.
ఇక ఇప్పుడు సౌదీ అరేబియా తమపై ఎలాంటి నిషేధం విధించకున్నా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. అమెరికాలో ఉన్న తన పౌరులకు అత్యవసర అదేశాలు జారీ చేసింది. పౌరులారా.. అమెరికాలో మీరు ఇవి చేయొద్దు.. అవి చేయొద్దు.. ఇలా ఉండాలి.. ఇలా మెలగాలి అంటూ కొన్ని భద్రతా చర్యలు సూచించింది.
అగ్ర రాజ్యంలోని సౌదీ విద్యార్థులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలంటూ సూచించింది. ఎలాంటి పనులు చేయాలో, వేటికి దూరంగా ఉండాలో తెలియజేసింది. అమెరికాలో నివసిస్తున్న సౌదీ పౌరులైనా.. అగ్రరాజ్యం వెళ్లే వాళ్లయినా ఈ సూచనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు రాబోవని చెబుతోంది.

అమెరికాలో మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు...
సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయండి.
తీవ్రవాదం, ఉగ్రవాదం తదితర వాటికి సంబంధించిన ఫేస్ బుక్, సోషల్ మీడియా గ్రూపుల నుంచి తక్షణమే బయటికి వచ్చేయండి.
అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడకండి. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టకండి. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతోన్మాదంతోపాటు అమెరికాకు వ్యతిరేకంగా తీసిన సినిమాలను డౌన్లోడ్ చేయకండి.
ఎయిర్ పోర్టుల్లో, అమెరికాలో అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా కూల్ గా ఉండండి. అమెరికా నియమ నిబంధనలను విధిగా పాటించండి.
చిన్నచిన్న తప్పులకు విధించిన జరిమానాలను వెంటనే కట్టేయండి. కోర్టులో హాజరయ్యే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు. అమెరికా వ్యతిరేక వైఖరి ఉన్న సినిమాలను కూడా డౌన్లోడ్ చేసుకోవద్దని కూడా సౌదీ ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించిందంటే.. ట్రంప్ పెట్టిన సెగ దెబ్బ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications