షాక్: అమెరికాపై అణుయుద్ధానికి సై అంటున్న ఉత్తర కొరియా, కలవరపడుతున్న ట్రంప్

అవసరమైతే అమెరికాపై అణుయుద్ధానికీ వెనుకాడం అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసిన ప్రకటనతో ట్రంప్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

వాషింగ్టన్: ఉత్తర కొరియా దెబ్బకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఉత్తర కొరియాను అదుపు చేయడానికి చైనా సహకరిస్తే బాగుంటుందనేది ట్రంప్ భావన.

కానీ ఈ విషయంలో చైనా ఉదాసీన వైఖరికి తోడు, అవసరమైతే అమెరికాపై అణుయుద్ధానికీ వెనుకాడం అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసిన ప్రకటనతో ట్రంప్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

ఉత్తర కొరియా దూకుడుకు చైనా కళ్లెం వేస్తే బాగుంటుందంటూ ట్రంప్ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ట్వీట్ ను చైనా చూసీ చూడనట్లు వదిలేసింది.

How Donald Trump unexpectedly PHONED China to discuss Kim Jong-un

మరోవైపు ఉత్తర కొరియా సముద్ర జాలాల చేరువలోకి అమెరికా యుద్ధనౌకలు వెళ్లడంతో ఆ దేశాధ్యక్షుడు కిమ్ రెచ్చిపోయారు. అమెరికాపై అణ్వాయుధాలతో విరుచుకుపడతామంటూ ఆయన హెచ్చరించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్ తిన్నాయి.

దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హతాశుడయ్యారు. ఉత్తర కొరియా ఆయన్ని కలవరపెడుతోంది. అందుకే చైనా ద్వారా ఆ దేశానికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో తన కెమిస్ట్రీ బాగుందంటూ ట్రంప్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

మంగళవారం జిన్ పింగ్ కు ట్రంప్ ఫోన్ కూడా చేశారు. తాము వ్యాపార సంబంధాల గురించే కాక మరెన్నో అంశాలు చర్చించుకున్నామంటూ మీడియాతో ట్రంప్ పేర్కొనడం గమనిస్తే.. ఉత్తర కొరియా విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్లు, అందుకే చైనాను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. మరి ఉత్తర కొరియా ఇంతటితో ఆగుతుందో లేక అన్నంత పనీ చేస్తుందో వేచి చూడాల్సిదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+