అమెరికాలో ఏ రాష్ట్రంలో ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు... ఎవరికెన్ని అనుకూలం... విన్నింగ్ ఛాన్స్ ఎవరికి..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. 70 ఏళ్లు పైబడ్డ ఇద్దరు వృద్ద నాయకుల మధ్య జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో చివరకు విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు తేల్చగా... ఎన్నికల ఫలితాల్లో ఇదే నిజం కాబోతుందా... లేక గత 2016 అధ్యక్ష ఎన్నికల్లాగే సర్వేల అంచనాలు తలకిందులవుతాయా అన్న చర్చ జరుగుతోంది. ట్రంప్‌కు షై ఓటు బ్యాంకు చాలానే ఉందని... అధ్యక్ష ఎన్నికలపై ఆ ప్రభావం కూడా ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

విన్నింగ్ ఛాన్స్ ఎవరికి...?
చికాగోకి చెందిన పొలిటికల్ డేటా అగ్రిగేటర్ రియల్ క్లియర్ పాలిటిక్స్(RCP) ప్రకారం... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా పరిగణించబడుతున్న రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్,ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే 3.3 పాయింట్ల ముందంజలో ఉన్నారు. ఇందులో వికాన్సిన్,మిచిగాన్,పెన్సిల్వేనియా,నార్త్ కరోలినా,ఫ్లోరిడా,అరిజోనా రాష్ట్రాలున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్‌ను బట్టి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచేందుకు 49.1శాతం అవకాశం ఉందని,ట్రంప్ గెలుపుకు 45.8శాతం అవకాశం ఉందని ఆర్సీపీ వెల్లడించింది.

ఎలక్టోరల్ ఓట్లే కీలకం...
అటు నేషనల్ పోల్స్ సర్వేల్లోనూ జో బైడెన్ ఆదరణ క్రమంగా పెరుగుతూ 50శాతానికి చేరింది. నేషనల్ పోల్స్ ప్రకారం ప్రస్తుతం బైడెన్ 7.2శాతం పాయింట్ల ముందంజలో ఉన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వచ్చిన ఆదరణ కంటే ఇది స్వల్పంగా ఎక్కువే. అయితే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకు నేషనల్ పోల్స్‌తో పనిలేదు. ఇంకా చెప్పాలంటే... ఎక్కువ ఓట్లు సాధించినంత మాత్రాన అమెరికాకు అధ్యక్షులు అవరు. ఇక్కడ కావాల్సింది ఎలక్టోరల్ ఓట్లు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు.

ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్ ముందంజ..!!
రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ అంచనా ప్రకారం... జో బైడెన్‌కు ఇప్పటికే 118 అనుకూల ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్‌కు 57 అనుకూల ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మిగతా 95 ఎలక్టోరల్ ఓట్లలో ఎవరికి ఎక్కువ పోల్ అవుతాయో... వాళ్లే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ ముందంజలో ఉన్నప్పటికీ... నేషనల్ పోల్ అంచనాల్లో ప్లస్ 3శాతం లేదా మైనస్ 3 శాతం మార్జిన్ ఎర్రర్ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇది అనుకూలంగా మారవచ్చు లేదా ప్రతికూలంగా మారవచ్చు. ఈ లెక్కన ఈసారి పోటీ మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.
Recommended Video

ఏ రాష్ట్రంలో ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికను డిసైడ్ చేసే ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే... అలాబామాలో 9,అలస్కాలో 3,అరిజోనాలో 11,అర్కన్సాస్‌లో 6,కాలిఫోర్నియాలో 55,కొలరాడోలో 9,కొనెక్టికట్‌లో 7,డెలవార్‌లో 3,కొలంబియాలో 3,ఫ్లోరిడాలో 29,జార్జియాలో 16,హవాయిలో 4,ఇదహోలో 4,ఇల్లినాయిస్‌లో 20,ఇండియానాలో 11,లోవాలో 6,కాన్సాస్‌లో 6,కెంటకీలో 8,మైన్‌లో 4,మేరీలాండ్‌లో 10,మసాచూట్స్‌లో 11,మిచిగాన్‌లో 16,మిన్నెసొటా 10,మిస్సిస్సీపీలో 6,మిసౌరిలో 10,మొంటానాలో 3,నెబ్రస్కాలో 5,నెవాడాలో 6,న్యూ హాంప్‌షైర్‌లో 4,న్యూజెర్సీలో 14,న్యూ మెక్సికోలో 5,న్యూయార్క్‌లో 29,నార్త్ కరోలినాలో 15,నార్త్ డకోటాలో 3,ఒహియాలో 18,ఓక్లహామాలో 7,ఒరేగాన్‌లో 7,పెన్సిల్వేనియాలో 20,రోడ్ ఐస్‌లాండ్‌లో 4,సౌత్ కరోలినాలో 9,సౌత్ డకోటాలో 3,టెన్నెస్సీలో11,టెక్సాస్‌లో 38,ఉతాహ్‌లో 6,వెర్మోంట్‌లో 3,వర్జీనియాలో 13,వాషింగ్టన్‌లో 12,వెస్ట్ వర్జీనియాలో 5,వికాన్సిన్‌లో 10,వ్యోమింగ్‌లో 3 ఎలక్టోరల్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications