హీరోగా నిలిచిన మసీదు కార్మికుడు : గన్ లాక్కొని, బెదిరించడంతో దుండగుడు పరారీ

క్రిస్ట్ చర్చ్ : మసీదులో ఉన్నవారంతా ప్రార్థనలు చేస్తుండగా శ్వేతజాతీయుడి రూపంలో మృత్యువు వచ్చింది. మిలిటరీ డ్రెస్సు ధరించి .. వెపన్ తో కాల్పులు జరుపుతుండగా క్రిస్ట్ చర్చిలోని మసీదులో పనిచేసే కార్మికుడు అలర్టయ్యాడు. ప్రాణాలకు తెగించి ఓ దుండగుడి నుంచి గన్ లాక్కున్నాడు. ఆ తుపాకీ చూపించి బెదిరించడంతో దుండగుడు పారిపోయాడు. దీంతో మృతుల సంఖ్య తగ్గింది. లేదంటే సాయుధలైన దుండగుల చేతిలో మసీదులో ఉన్నవారంతా చనిపోయే పరిస్థితి ఏర్పడేది.

హీరోగా నిలిచాడు ..
క్రిస్ట్ చర్చ్ లోని లీన్ వుడ్ మసీదులో 70 మంది ప్రార్థనలు చేస్తుండగా దుండగులు కాల్పులతో తెగబడ్డారు. తుపాకీ శబ్ధంతో అక్కడున్న వారు కేకేలు పెట్టారు. సాయం చేయాలని అర్థించారు. సాయం చేయాలని మహిళ అరవగా .. దుండగుడు కాల్చాడని .. అప్పుడే దుండగుడి పక్కనుంచి మసీదు కార్మికుడు వచ్చి తుపాకీ లాక్కున్నాడని ప్రత్యక్షసాక్షి సయ్యద్ మజారుద్దీన్ వెల్లడించినట్టు స్కై న్యూస్ పేర్కొన్నది.

How mosque worker grabbed attackers gun and saved more people from dying

హ్యాట్సాప్ టు హీరో

మసీదు కార్మికుడు దుండగుడిని కాల్చేందుకు ప్రయత్నించాడని ప్రత్యక్ష సాక్షి సయ్యద్ తెలిపారు. దీంతో దుండగుడు అక్కడినుంచి ప్రార్థనలు చేస్తున్నవారిని అడ్డు పెట్టుకొని పారిపోయాడని పేర్కొన్నారు. తర్వాత కార్మికుడు మసీదులో ఉన్న వారిని క్షేమంగా బయటకు పంపించినట్టు తెలిపారు. ఆ సమయంలో అతను రాకుంటే మేం బతికే వారిమి కాదని, మా పాలిట అతను హీరో అని, హ్యాట్సాప్ అని అభినందించాడు. దుండగుల కాల్పులతో రక్తమోడుతోన్న వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఎమర్జెన్సీ సర్వీసును సంప్రదించానని వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+