Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నడిసముద్రంలో యుద్ధ మేఘాలు. అమెరికాకు రష్యా వార్నింగ్. యుద్ధానికి వేళాయే?

వెనిజులా చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాలను మరోసారి కలవరపెడుతున్నాయి. అమెరికా దళాలు (US Coast Guard ) వెనిజులా‌కు సంబంధం ఉన్న రెండు ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం, ఆ వెంటనే అమెరికా.. వెనిజులా చేస్తున్న చమురు విక్రయాలపై దీర్ఘకాలిక నియంత్రణ ప్రణాళికను ప్రకటించడం ఇవన్నీ రష్యాను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం వ్యాప్తంగా కలవరం మొదలైంది. దునియాలోనే రెండు శక్తివంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్న వేళ.. నడి సముద్రంలో యుద్ద మోఘాలు కమ్ముకున్నాయా? యుద్ధం అనివార్యమైతే.. చమురు ధరలు ఎంత మేర పెరుగుతాయి? భారత దేశానికి ఉన్న రిస్క్ ఏంటో విశ్లేషిద్దాం..

ప్రస్తుత అమెరికా-వెనిజులా-రష్యా మధ్య నెలకున్న పవర్ పాలిటిక్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే.. అంతర్జాతీయ చట్టాలను ఎవరు అతిక్రమించారు. చమురు, గ్లోబల్ ఎనర్జీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది చూస్తే.. వెనిజులా‌కు సంబంధించిన చమురు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. అమెరికా కోస్ట్ గార్డ్స్ రెండు ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం, ఆపై వెనిజువేలా చమురు విక్రయాలపై దీర్ఘకాలిక నియంత్రణ ప్రకటించడం.. గ్లోబల్ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ చర్యలపై రష్యా తీవ్రంగా స్పందించడంతో, పరిణామాలు ద్వైపాక్షిక అంశాల్ని దాటి ప్రపంచంపై ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి.

How US Seizures and Russian Anger Over Venezuela Could Reshape Global Oil Trade

అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ..

ఉత్తర అట్లాంటిక్, కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో అమెరికా కోస్ట్ గార్డ్, ఇతర భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లలో...రష్యా జెండా ఉన్న రెండు నౌకలు.. ప్రయాణిస్తుండా అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ వెనిజులా చమురును తరలిస్తున్నారన్న ఆరోపణలే ఈ చర్యలకు కారణమని అమెరికా అధికారులు వెల్లడించారు. చట్టబద్ధంగానే సీజ్ చేపట్టినట్లు వాషింగ్టన్ స్పష్టం చేసింది.

పైరసీతో సమానం..

ఈ చర్యలపై రష్యా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో చట్టబద్ధంగా నమోదు అయిన నౌకలను సీజ్ చేయడం.. అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని ఆరోపించింది. ఈ స్వాధీనాన్ని "పైరసీతో సమానం"గా పేర్కొంటూ, నౌకల్లో ఉన్న రష్యా పౌరులను తక్షణమే గౌరవపూర్వకంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

నియో-కాలనియల్ విధానం..

ఇదే సమయంలో వెనిజులా చమురు విక్రయాలపై అమెరికా నియంత్రణ ప్రకటించడం మరో కీలక పరిణామంగా మారింది. వెనిజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యవేక్షించి, దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణకు ఉపయోగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే దీనిని రష్యా, చైనా వంటి దేశాలు 'నియో-కాలనియల్ విధానం'గా విమర్శిస్తున్నాయి.

చమురు ధరల్లో ఒడిదుడుకులు

ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన వెనిజులా సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఆర్థిక ఒత్తిడిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ చట్టాల భవిష్యత్తుపై..

చమురు ధరల అస్తిరత ప్రభావం చివరికి సామాన్య ప్రజలపై పడనుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలతో ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చట్టాల భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. శక్తివంతమైన దేశాలు తమ ప్రయోజనాల కోసం చట్టాలను ఎలా వినియోగిస్తున్నాయనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో సముద్ర మార్గాల భద్రత, స్వేచ్ఛా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి, వెనిజులా చమురు చుట్టూ సాగుతున్న ఈ పరిణామాలు ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా గ్లోబల్ పాలిటిక్స్, ఆర్థిక సంక్షోభంగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు రాజీతో ముగుస్తాయా, లేక ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు తీసుకెళ్తాయా అన్నది రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా తీసుకునే అంతర్జాతీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+