హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

చైనాలోని నాన్ చాంగ్ నగరంలో ఉన్న ఓ లగ్జరీ హోటల్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

బీజింగ్: చైనాకు ఆగ్నేయంగా ఉన్న నాన్ చాంగ్ నగరంలోని ఓ నాలుగంతస్తుల లగ్జరీ హోటల్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలియజేసింది.

చైనాలోని జియాంగ్జి రాష్ట్ర రాజధాని అయిన నాన్‌చాంగ్ నగరంలో ఉన్న హెచ్ఎన్ఏ ప్లాటినమ్ మిక్స్ అనే పేరుతో ఉన్న ఈ హోటల్ లో మంటల్లో కాలిపోయిన ఏడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.

సుమారు 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వీరిలో మరో ముగ్గురు మృతి చెందారు.

Huge Fire At Luxury Hotel In China, Many Feared Trapped

అగ్నిమాపక సిబ్బంది హోటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. పలువురిని ప్రాణాలతో రక్షించారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఒక వ్యక్తి హోటల్లోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు.

అంత ఎత్తునుంచి కిందకు దూకడం వల్ల ఇతడు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మంటలయితే అదుపులోకి వచ్చాయిగానీ, ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి దర్యాప్తు జరుగుతోంది.

ఈ హోటల్ పక్కనే ఉన్న 24 అంతస్తుల అపార్టుమెంటులో 260 మందికి పైగా ఉంటారు. వాళ్లందరినీ వెంటనే ఖాళీ చేయించారు. ఈ హోటల్ యాజమాన్యానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+