భారీ పరిహారం: స్నేహితుడి భార్యతో సెక్స్, ఆన్‌లైన్‌లో వీడియో
ఫ్లోరిడా: తన స్నేహితుడి భార్యతో గడిపిన సెక్స్ టేప్ వ్వవహారంలో ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్‌కు భారీ పరిహారం దక్కింది. హోగన్‌కు $115 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ గాకర్ మీడియాను అమెరికాలోని ఫ్లోరిడా కోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి శుక్రవారం వాదనాలు ప్రారంభమయ్యాయి. ఇరుపక్షాల వాదోపవాదనలు ప్రారంభమైన ఆరు గంటల్లోపే న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. అయితే కోర్టు తీర్పుపై సోమవారం అప్పీల్‌కు వెళతామని గాకర్ మీడియా వ్యవస్థాపకుడు నిక్ డెంటన్ ప్రకటించారు.
అయితే కోర్టు తీర్పుపై గాకర్ మీడియా యాజమాన్యం సంతృప్తి చెందలేదు. అయితే హోగన్ తరుపు లాయర్ మాత్రం తాము ఊహించిన విధంగానే తీర్పు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక వివరాల్లోకి వెళితే... తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ భార్యతో హోగన్ ఏకాంతంగా గడిపిన సెక్స్ వీడియోను 2012లో గాకర్ వెబ్ సైట్ పోస్టు చేసింది.
అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేయడంతో తన రెజ్లర్ జీవితానికి నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గాకర్ మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. తనకు జరిగిన నష్టానికి గాను 100 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇప్పించాలని కోర్టును కోరాడు.

నా క్లైయింట్ తన స్నేహితుడి భార్యతో గడిపిన శృంగారాన్ని రహస్యంగా వీడియో చిత్రీకరించి, ఇంటర్నెట్‌తో పాటు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారని హోగన్ తరుపు న్యాయవాది తెలిపారు. అంతేకాదు సెలబ్రిటీల విషయంలో గాకర్ మీడియా జర్నలిజం ప్రమాణాలను పాటించలేదని ఆయన తెలిపారు.
సెలబ్రిటీల జీవితాలను కాలరాసే హక్కు మీడియాకు లేదని న్యాయమూర్తి ఎదుట వాదించారు. ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టే ముందు హోగన్‌ను కాని, అతడితో సన్నిహితంగా గడిపిన మహిళను సంప్రదించలేదని ఆయన తెలిపారు.
కాగా ఈ వీడియోలో హోగన్‌తో గడిపిన మహిళ భర్తను మాత్రం గాకర్ మీడియా సంప్రదించిందని వెల్లడించారు. ఇరువైపు వాదోపవాదనలు విన్న ఫ్లోరిడా కోర్టు హోగన్‌కు $115 మిలియన్ డాలర్లు గాకర్ మీడియా చెల్లించాలంటూ ఆదేశించింది.
ఇక గాకర్ మీడియా విషయానికి వస్తే న్యూయార్క్ నగరంలో మీడియా రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న గాసిప్ వెబ్‌సైట్‌గా పేరుగాంచింది. హోగన్ సెక్స్ టేప్ కేసు విషయంలో చాలా మంది అభిమానులకు తెలియనటువంటి ఆయన వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వచ్చాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications