వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుంది
Recommended Video
పెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చుకుని గుటుక్కున మింగేస్తుంది. కొన్ని పాములైతే తమ సొంత పిల్లలనే మింగేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ పెద్ద పాముకు ఆకలి వేసినట్లు ఉంది. అయితే ఏంమింగిందో తెలుసా... మేము చెప్పడం ఎందుకు మీరే చూసేయండి. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం కడుపులో తిప్పేస్తుంది జాగ్రత్త...

పాముకు ఆకలి వేసింది
ఆకలి వేసిన పాముకు తన శరీరాన్నే నోట్లో పెట్టేసుకుంది. చూడాటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా... ఈ వీడియోకు మాత్రం కొన్ని లక్షల్లో లైకులు షేర్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను లైవ్‌లో రికార్డు చేశారు జంతుప్రేమికుడు జెస్సీ రాట్‌తాకర్. ముందుగా పాము తన తోకను నోట్లో పెట్టుకుని సగం భాగం వరకు కుక్కుకుంది. ఆ తర్వాత తిరిగి మొత్తాన్ని బయటకు తీసింది. మళ్లీ తినే ప్రయత్నం చేసింది.
తోకను మరో పాముగా భావించి ఉండొచ్చు
పాము అలా తన శరీరాన్నే తను తినడం వెనక కారణం జెస్సీ వివరించారు. సాధారణంగా కింగ్ కోబ్రాలు ఇతర పాములను తింటాయని కొన్నా సార్లు పొడవుగా ఉన్న తన తోకనే మరో పాముగా భావించి తింటాయని జెస్సీ తెలిపారు. అయితే ఎప్పుడైతే నొప్పి కలుగుతుందో అప్పుడు తన శరీరాన్ని తానే పొరపాటున నోట్లో పెట్టుకున్నట్లు గ్రహిస్తాయని చెప్పారు. ఇక లైవ్‌లో ఆ పాము తన శరీరాన్ని తినేదానిపై కెమెరాను ఫోకస్ చేశారు జెస్సీ. పాముకు ఆహారంను పెడుతున్నామని చెప్పిన జెస్సీ.. అయితే దాని ఆకలి ఇంకా తీరనట్లుంది కాబట్టే తన సొంత తోకను నోట్లోకి కుక్కేసుకుందని చెప్పారు.

చివరి ప్రయత్నంలో తోకను వదిలేసిన పాము
ఇక సగానికి పైగా తోకను నోట్లోకి పెట్టేసుకోవడంతో భయపడిపోయిన జెస్సీ వెంటనే పామును తడమడంతో తోకను వదిలేసింది. సాధారణంగా పాములు ఏదైనా తినేసమయంలో వాటిని బెదిరించడంలాంటివి చేస్తే నచ్చదని చెప్పారు జెస్సీ. అవి వెంటనే తినే ఆహారంను అక్కడే వదిలేసి వెళ్లిపోతాయట. కానీ ఇక్కడ పాము మాత్రం ఎంత గుచ్చినప్పటికీ తన తోకను మాత్రం వదలలేదు. ఇంకా లోపలికి తన సొంత తోకనే కుక్కే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత జెస్సీ తన గోర్లతో గుచ్చడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ వదల్లేదు. ఇక చివరి ప్రయత్నంలో ఆ పాము తన తోకను వదిలేసింది. సగానికి పైగా తన శరీరంను పాము మింగేసింది. ఆగష్టు 9న ఈ వీడియోను జెస్సే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు అయిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications