సెక్స్,డ్రగ్స్,ఎఫైర్స్.. బండారమంతా బట్టబయలు... హంటర్ బైడెన్ కొంపముంచిన ల్యాప్‌టాప్..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఓ సంచలనాత్మక వార్తా కథనం తెర పైకి వచ్చింది. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(50) 'సెక్స్ ఎడిక్ట్' అని,విశృంఖల శృంగారం కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెడుతుంటాడని ఆ కథనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా అక్రమ సెక్స్ సంబంధాలకు అతను బానిసయ్యాడని పేర్కొన్నారు. అలాగే డ్రగ్స్,అవినీతి,బ్లాక్‌మెయిల్స్... ఇలా అతని వ్యక్తిగత జీవితం మొత్తం వ్యసనాలతో నిండిపోయినట్లు అందులో తెలిపారు. హంటర్ బైడెన్‌పై అవినీతి ఆరోపణలు... అనూహ్యంగా ఆయన ల్యాప్‌టాప్ ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో ఈ విషయాలన్నీ వెలుగుచూశాయి.

ఆ ఆరోపణలతో ఎఫ్‌బీఐ రంగంలోకి...
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంటర్ బైడెన్ అవినీతి,అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,రిపబ్లిక్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు. చైనాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి హంటర్‌కు 10 మిలియన్ డాలర్లు అందాయని... ఇందులో జో బైడెన్ ప్రమేయం ఉందని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణకు ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా జో బైడెన్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని... అందులో ఉన్న డేటాను మొత్తం పరిశీలించింది.

బైడెన్ ల్యాప్‌టాప్ చిక్కిందిలా...
హంటర్ బైడెన్ ఏప్రిల్,2019లో తన ల్యాప్‌టాప్ రిపేర్ కోసం దాన్ని ఓ షాపులో అప్పగించాడు.కానీ మళ్లీ దాన్ని వెనక్కి తీసుకోలేదు. బైడెన్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ల్యాప్‌టాప్ వ్వవహారం తెరపైకి రావడంతో ఎఫ్‌బీఐ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేయడం అధికారులకు అంత కష్టమేమీ కాలేదని... హంటర్ సులువైన పాస్‌వర్డ్‌ను వాళ్లు ఇట్టే కనిపెట్టేశారని పలు కథనాలు చెప్తున్నాయి. ఆ కథనాల ప్రకారం... హంటర్ బైడెన్ తన ల్యాప్‌టాప్‌కు 'Hunter02' పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నాడు.

ల్యాప్‌టాప్‌లో ఏముంది...
జో బైడెన్ ల్యాప్‌టాప్‌లో మూడు ప్రైవేట్ ఈమెయిల్స్‌తో పాటు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పేర్లను గుర్తించారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్,డెమోక్రాటిక్ నేత హిల్లరీ క్లింటన్,బరాక్ ఒబామా కేబినెట్‌లో పనిచేసిన ప్రతీ ఒక్కరి ఫోన్ నంబర్లను అందులో గుర్తించారు. అలాగే దాదాపు 1500 సెలబ్రిటీల ఫోన్ నంబర్లు,హైప్రొఫైల్ వ్యక్తుల నంబర్లను గుర్తించారు. ఇందులో ఎఫ్‌బీఐ మాజీ బాస్ లూయిస్ ఫ్రీహ్ ఫోన్ నంబర్ కూడా ఉండటం గమనార్హం.

సెక్స్,డ్రగ్స్,ఎఫైర్స్...
హంటర్ పలువురితో శృంగారంలో పాల్గొన్న సెల్ఫీలు,వీడియోలు,డ్రగ్స్ సేవిస్తున్న చిత్రాలను కూడా ల్యాప్‌టాప్‌లో ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. గతంలో ఒక్కరాత్రి శృంగారం కోసం అతను 11,400 డాలర్లు ఖర్చు చేసినట్లు ల్యాప్‌టాప్‌లో లభించిన సమాచారంతో గుర్తించారు. అలా చాలాసార్లు సింగిల్ నైట్స్ కోసం అతను వేల డాలర్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అలాగే ఓ పోర్న్ వెబ్‌సైట్‌లో 'లైవ్ క్యామ్' కోసం 21వేల డాలర్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. హంటర్ బైడెన్‌కు డ్రగ్స్,ఆల్కహాల్,వేశ్యలు,స్ట్రిప్ క్లబ్స్,ఎఫైర్స్... ఇలా చాలా వ్యసనాలున్నాయని గతంలో అతని భార్య విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. 2009లో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక... హంటర్ బైడెన్‌కు కూడా ప్రత్యేక సెక్యూరిటీ కల్పించారు. కానీ తన విశృంఖల జీవితానికి సెక్యూరిటీ అడ్డుగా ఉందని భావించి.. దాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాడు. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో... ఇక అతని విచ్చలవిడి జీవితానికి హద్దు లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications