• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంట్లో ఇల్లాలు వీధిలో ప్రియురాలు: ఈ భార్య ప్రియుడితో ఉండగా పట్టించిన గూగుల్ యాప్..ఎలాగో చూడండి

|

ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటే మానవుడు పోటీపడుతున్నాడు. టెక్నాలజీ నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ల్యాండ్ ఫోనే దిక్కు... కానీ ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం టెక్నాలజీనే. టెక్నాలజీకి అలవాటు పడటం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ... మరోరకంగా అది కీడు కూడా తలపెట్టొచ్చు. టెక్నాలజీ ఆధారంగా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. అదే సమయంలో చాలా సమస్యలు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీ కొందరి కాపురాలను నిలబెడుతుంటే మరికొందరి కాపురాలను కూలగొడుతోంది. టెక్నాలజీ గురించి ఇదంతా ఇప్పుడు ఎందుకనుకుంటున్నారా అయితే ఈ టెక్నాలజీ కా కహాని ఒకసారి చదవండి.

టెక్నాలజీ ఎంత పని చేసింది

టెక్నాలజీ ఎంత పని చేసింది

టెక్నాలజీ ఓ మనిషికి న్యాయం చేస్తే మరో మనిషికి అన్యాయం చేసింది. అయితే తప్పు ఎవరిది అని చెప్పేకన్నా టెక్నాలజీ ఎంతపని చేసింది అని చెప్పుకోవడమే మంచిది. ఇక అసలు విషయానికొస్తే పెరూలో నివసిస్తున్న దంపతుల విడాకులు తీసుకునేందుకు కారణమైంది టెక్నాలజీ. తన భార్యను ఒక మంచి టూరిస్ట్ స్పాట్‌కు తీసుకెళుదామనుకున్నాడు భర్త. ఇందుకోసం గూగుల్ స్ట్రీట్ వ్యూ యాప్‌లో మంచి పర్యాటక స్థలాలకోసం వెతికాడు. ఇలా యాప్‌పై వెతికే క్రమంలో ఒక్కసారిగా అతనికి ఒక జంట తారసపడింది. కాస్త దగ్గరగా చూడగా అంతే ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు.

 భార్య మరొకరితో ఉండగా ట్రాక్ చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ

భార్య మరొకరితో ఉండగా ట్రాక్ చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ

గూగుల్ మ్యాప్‌లో చూసింది తన భార్యనే అన్న నిజాన్ని ఆవ్యక్తి నమ్మలేకపోయాడు. మళ్లీ మరోసారి స్పష్టంగా చూసి ఆ మహిళ తన భార్యే అనే నిర్ధారణకొచ్చాడు. ముందుగా గుర్తు పట్టకపోయినప్పటికీ ఆమె వేసుకున్న దుస్తులు ఆమె రూపం ఆదారంగా తన భార్యే అన్న నిర్ధారణకు వచ్చేశాడు. ఆ సమయంలో భార్య తన ప్రియుడిని ఆమె ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఉంది.

టెక్నాలజీ చేసిన పనికి భార్యకు విడాకులు ఇచ్చేశాడు

టెక్నాలజీ చేసిన పనికి భార్యకు విడాకులు ఇచ్చేశాడు

ముందుగా ఈ ఫోటోను చూసిన భర్త అది 2013లో గూగుల్ ప్రయోగాత్మకంగా విడుదల చేసిన ఫోటోగా భావించాడు. అయినప్పటికీ ఎందుకో ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. ఒకవేళ ఐదేళ్ల క్రితందే ఆ ఫోటో అనుకున్నప్పటికీ వారిద్దరి మధ్య ఇంకా సంబంధం ఉండి ఉండొచ్చు కదా అనే అనుమానం భర్తలో మరింత బలపడింది. అయితే గట్టిగా నిలదీయగా అమ్మాయి తన పెళ్లికంటే ముందు మరో వ్యక్తితో ప్రేమయాణం నడిపినట్లు ఒప్పుకుంది. దీంతో భర్త ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నాడు. అయితే ఆ సంబంధం ఇంకా కొనసాగుతోందా లేదా పెళ్లికి ముందే కట్ అయ్యిందా అనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A JILTED husband has discovered his wife has been having an affair after coming across a picture of her together with her secret lover on Google Street View.The unnamed man, who is from Peru, took to Facebook to detail how he came uncovered the image while using the Google Maps feature to plan a trip.It was then that he stumbled upon an image of a woman he spotted sitting on a bench with another unidentified man lying across her lap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more