ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్బర్గ్ భర్త డేవిడ్ హఠాన్మరణం
లాస్ ఏంజిల్స్: ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్బర్గ్ భర్త డేవిడ్ గోల్డ్ బర్గ్ హఠాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు మే 2వ తేదీన తెలిపారు. అతను ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని శనివారం నాడు తెలిపారు.
స్నేహితులకు, కుటుంబ సభ్యులకు విషాదకర వార్త అని, డేవ్ గోల్డ్ బర్గ్ మృతి చెందారని అతను పేర్కొన్నారు. డేవ్ గోల్డ్ బర్గ్, షెరిల్ శాండ్‌బర్గ్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డేవ్ గోల్డ్ బర్గ్ తండ్రి పేరు పౌలా గోల్డ్ బర్గ్. ఇతను రాత్రిపూట కన్నుమూశారు.

డేవిడ్ గోల్డ్ బర్గ్ ఆన్ లైన్ సర్వే కంపెనీ సర్వే మంకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఈ సంస్థ కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఉంది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ పోస్ట్ చేశారు. గోల్డ్ బర్గ్ అమేజింగ్ వ్యక్తి అని అందులో పేర్కొన్నారు. కాగా, గోల్డ్ బర్గ్ వయస్సు 47.












Click it and Unblock the Notifications