కూచిభొట్ల హత్య: హంతకుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు..
అమెరికా: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల(33) హంతకుడికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పుపై కూచిభొట్ల భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు.
కాగా, గతేడాది స్నేహితుడితో కలిసి కాన్సాస్ లోని ఓ బార్ కి వెళ్లిన సమయంలో ప్యురింటన్(52) అనే వ్యక్తి శ్రీనివాస్ పై కాల్పులకు తెగబడ్డాడు. 'నా దేశం నుంచి వెళ్లిపోండి' అని పెద్దగా అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాదసాని గాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్, అలోక్ మాదసానిలపై కాల్పుల సమయంలో ఇయాన్ గ్రిలట్ అనే వ్యక్తి నిందితుడు ప్యురింటన్ ను అడ్డుకోబోయాడు.
ఈ క్రమంలో అతనికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, భర్త దూరమవడంతో శ్రీనివాస్ భార్య సునయన తీవ్ర మనస్థాపం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగానికి కూచిభొట్ల భార్య సునయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూచిభొట్లపై దాడిని ఆయన ఖండించారు.
ఇదిలా ఉంటే, ప్యురింటన్ జీవితఖైదుపై కొంతమంది న్యాయవాదులు మాట్లాడుతూ... అతను 50ఏళ్ల తర్వాత గానీ పెరోల్ పై బయటకొచ్చే అవకాశం లేదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications