నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్
పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నానని జైషే మహ్మద్ మాతృపత్రిక అల్‌ఖలామ్‌లో ఓ కాలమ్ ద్వారా తెలియజేశాడు.
ఈ నెల మొదటివారంలో మసూద్ అజార్ మృతి చెందాడంటూ వార్తలు షికారు చేశాయి. మసూద్ అజార్ లివర్ కిడ్నీలు ఫెయిల్ అవడంతో మృతి చెందాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంతేకాదు పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ కూడా మసూద్ అజార్ మృతి చెంది ఉంటాడనే అనుమానం వ్యక్తం చేయడంతో నిజంగా మృతి చెందాడని అంతా భావించారు. సోషల్ మీడియాలో మాత్రం అజార్ మృతిపై వార్తలు హల్చల్ చేసినప్పటికీ అధికారికంగా ఎక్కడా సమాచారం బయటకు రాలేదు.

ఇక తన మాతృపత్రిక అల్ ఖలామ్‌లో తాను మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నాడు మసూద్ అజార్. పుల్వామా ఉగ్రదాడులను మసూద్ ప్రశంసించాడు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారని కశ్మీర్‌లో తమ సంస్థ బాగా పనిచేస్తోందని కొనియాడాడు మసూద్. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది అదిల్ దార్ రగల్చిన ఈ మంట చల్లారదని దీన్ని ఎవరూ ఆర్పలేరని అన్నాడు మసూద్. ఫిబ్రవరి 14న భారత కాన్వాయ్ పై ఓ కారులో పేలుడు పదార్థాలతో దూసుకెళ్లాడు అదిల్. ఆ తర్వాత భారతవైమానిక దళం బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించి శిబిరాలను ధ్వంసం చేసింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications