రేప్ ప్రత్యక్ష ప్రసారం: తప్పు చేయలేదని వాదన
వాషింగ్టన్: మైనర్ బాలికపై తన మిత్రుడు అత్యాచారం జరుపుతుండగా దాన్ని పెరిస్కోప్ యాప్‌లో లైవ్ ప్రసారం చేసిన నిందితురాలు తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను ఏ తప్పూ చేయలేదని ఆమె కోర్టుకు తెలిపింది. తాను అమాయకురాలినని అంటూ తనపై మోపిన అభియోగాలను ఎత్తేయాలని కోరింది.
18 ఏళ్ల మేరికా లోనినా గత ఫిబ్రవరిలో తన మిత్రుడు 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా దాన్ని పెరిస్కోప్ యాప్‌లో లైవ్ ప్రసారం చేసింది. అమెరికా ఓహి రాష్ట్రంలోని న్యూ అల్బెనీ హై స్కూల్లో చదువుతున్న లొనినా తాజాగా కోర్టు విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది.

ఆమె తరఫున మహిళా న్యాయవాది సామ్ షమాన్‌స్కీ వాదించింది. లొనినాకు ప్రతిదాన్నీ వీడియో తీసే అలవాటు ఉందని, అందులో భాగంగానే పెరిస్కోప్ యాప్‌తో ఆ ఘటనను చిత్రీకరించిందని, ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తోచలేదని, అందుకే దాన్ని లైవ్ చేస్తూ తానేం చేయాలి, ఎలా అపాలని అని యాప్ ఫాలోయర్లను అడిగిందని ఆమె వాదించింది.
లొనినా మంచి అమ్మాయి అని, ఆమెను కేసు నుంచి తప్పించాలని ఆమె కోరింది. లొనినా, ఆమె స్నేహితుడు రేమండ్ గేట్స్ (29) ఈ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన గేట్స్ నివాసంలో మైనర్ బాధితురాలితో కలిసి గేట్స్, లొనినా మద్యం సేవించారు. ఆ తర్వాత గేట్స్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.
దాన్ని లొనినా పెరిస్కోప్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే లొనినా, గేట్స్‌లకు 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వడానికి లొనినాకు 125000 డాలర్లు (రూ.82.75 లక్షలు), గేట్స్‌కు 3 లక్షల డాలర్లు (రూ.1.99 కోట్లు) పూచీకత్తుగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.












Click it and Unblock the Notifications