వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నేను ముస్లింను! ఐ లవ్ యూ డొనాల్డ్ ట్రంప్’

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓ ముస్లిం వ్యాపారి చేసిన ప్రేమ పూరిత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘నేను ముస్లింను.. అయినా ట్రంప్‌ అంటే నాకు ఇష్టమే(ఐ లవ్ యూ)' అంటూ ఆ వ్యాపారి వ్యాఖ్యానించారు.

ఉగ్రదాడుల నేపథ్యంలో ట్రంప్‌ ఇటీవల చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా అభ్యంతరాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ముస్లింలను అనుమతించకూడదంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో ముస్లిం వర్గాలన్నీ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

I am a Muslim and I love you, Egypt-born man tells Trump

ఈ నేపథ్యంలో ఇబ్రహీం అనే ఈజిప్టుకు చెందిన వ్యాపారి చేసిన పైవ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, 1981లో ఈజిప్టు నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ఇబ్రహీం(62)ని స్థానిక మీడియా ఈ విషయమై ఇంటర్య్వూ చేసింది.

ఇబ్రహీం సమాధానమిస్తూ.. ‘మా వల్ల ముప్పు ఉందనుకుంటే ట్రంప్‌ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అవి నాకు ఇబ్బంది కలిగించేవే అయినా ఆయన వ్యాఖ్యలకి మద్దతు తెలుపుతాను' అంటూ చెప్పారు. తమ నిజాయితీని ట్రంప్ పరీక్షించాలనుకుంటే తానే అందుకు ముందుంటానని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యల్ని స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

English summary
Elhamy Ibrahim, 62, is a Muslim who does not like very many other Muslims these days, but loves Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X