‘హీరోయిన్ కావాలని వస్తే.. పోర్న్ స్టార్ చేశారు’

టోక్యో: ఆమె అందంగా ఉంటుంది. అందుకే తాను సినిమాల్లో హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కంది. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ చాలానే ప్రయత్నం చేసింది. చివరకు ఆమెను సినిమా ఛాన్స్ ఇస్తామని మోసం చేసిన కొందరు.. అత్యంత దారుణంగా పోర్న్ స్టార్‌ను చేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో అలాగే కొనసాగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమే జపాన్‌కు పాపులర్ పోర్న్ స్టార్ సాకీ కొజాయ్.

చదువు పూర్తయిన వెంటనే ఓ మోడలింగ్‌ ఏజెన్సీని సంప్రదించింది కొజాయ్. వారు ఆమెను అన్ని రకాలుగానూ పరీక్షించి ఆమెతో కాంట్రాక్ట్‌ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారు. రెండ్రోజుల తర్వాత ఆడిషన్‌కు రమన్నారు. దీని ద్వారా సినిమా ఛాన్స్ కూడా వస్తుందని ఎంతో సంతోషంగా ఆడిషన్స్‌కు హాజరైంది సాకీ.

Japanese

అయితే, ఆమెకు ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. చుట్టూ ఇరవై మంది నిలబడి కెమెరా ఆన్‌ చేసి బట్టలన్నీ విప్పేయమని చెప్పారు. అప్పటికి గానీ అర్థం కాలేదు.. అది ఓ పోర్న్‌ సినిమా షూటింగ్‌ అని. సాకీ వెంటనే ప్రతిఘటించింది. కానీ, వారు బలవంతంగా ఆమెను లొంగదీసుకున్నారు.

ఆ సమయంలో 'నేను ఈ పని చేయలేను అని ఎంతో ఏడ్చాను. కానీ, 20 మందితో పోరాడడానికి నా బలం సరిపోలేదు. అప్పటికి నేను వర్జిన్‌ను. కానీ, బలవంతంగా నాతో సెక్స్‌ చేయించారు. ఒకేరోజు నలుగురితో శృంగారంలో పాల్గొనేలా చేశారు. చెప్పకూడని పనులన్నీ చేయించారు' అని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాపోయింది.

Japanese

ఇక వారి నుంచి బయటపడడానికి మార్గం లేదని అర్థమైందని.. ఎందుకంటే రెండేళ్ల పాటు ఆ కంపెనీతో పనిచేస్తానని తనతో ముందు వారు సంతకం చేయించుకున్నారని తెలిపింది. ఒకవేల ఎదురించి బయటకు వస్తే కుటంబసభ్యులను చంపేస్తామని బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేగాక, ఒకసారి పోర్న్‌ సినిమాలో కనబడి బయటకు వస్తే వేరెవ్వరూ ఉద్యోగం ఇవ్వరని, దీంతో రాజీ పడిపోయి పోర్న్‌స్టార్‌గా మారిపోయినట్లు సాకీ వెల్లడించింది. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ నుంచి బయటపడినా.. విధిలేని పరిస్థితిలో ఫ్రీలాన్స్‌డ్‌ పోర్న్‌ యాక్ట్రస్‌గానే కొనసాగుతున్నట్లు ఆవేదనగా తెలిపింది సాకీ. కాగా, తనలాంటి అమాయక యువతులను కొన్ని కంపెనీలు ఇలా బలవంతంగా పోర్న్ నటులుగా చేస్తున్నారని వాపోయింది. ప్రభుత్వాలు ఈ కంపెనీలపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+