'నేను అతనితో హోటల్లో శృంగారంలోపాల్గొనలేదు'
వాషింగ్టన్: తాను మత గురువుతో శృంగారంలో పాల్గొనలేదని ఫ్రాన్సిస్కా చౌకీ బుధవారం నాడు వెల్లడించారు. తాను మత గురువుతో శృంగారంలో పాల్గొన్నానన్నది అవాస్తవమని కోర్టుకు తెలిపారు. అతనితో తనకు ఎలాంటి లైంగిక సంబంధం లేదన్నారు.
వాటికన్‌లోని ఓ ప్రార్థనాలయానికి సంబంధించిన రహస్య పత్రాలు లీకైన వ్యవహారంలో మాజీ పబ్లిక్ రిలేషన్ కన్సల్టెంట్ అయిన ఫ్రాన్సిస్కా చౌకీ అనే మహిళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెతో పాటు మత గురువు ఈ కేసులో ఉన్నారు.

వాటికన్ లీక్స్ 2గా పేరొందిన వాటికన్ రహస్య పత్రాలను తాను లీక్ చేసిన విషయం వాస్తవమేనని, అయితే వర్గీకృత పత్రాలను మాత్రమే జర్నలిస్టులకు తాను ఇచ్చానని సదరు మత గురువు విచారణ సందర్భంగా కోర్టులో వెల్లడించారు.
ఇక, ఫ్రాన్సిస్కా చౌకీతో తన సంబంధం కేవలం మత గురువుగా రాజీపడటం లాంటిదేనని, ఆమె తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించిందని పరోక్షంగా సూచించారు. తాను ఆమెతో శృంగారంలో పాల్గొనలేదని చెప్పారు. అసలు అలాంటి ఘటన జరగలేదని నిందితురాలు కూడా కోర్టుకు చెప్పారు.












Click it and Unblock the Notifications