''ప్లీజ్.. తెలియక చేరా.. సారీ చెబుతున్నా.. వదిలేస్తే ఇంటికెళ్తా..''
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీ యువతి ఇప్పుడు పశ్చాత్తపం వ్యక్తం చేస్తోంది. తెలియక ఈ సంస్థలో చేరానని, వదిలేస్తే తన ఇంటికెళ్తానంటూ ఇరాక్ లో బందీగా పట్టుబడి ఓ కారాగారంలో ఉన్న ఈమె విజ్ఞ
బెర్లిన్: చేతులు కాలాక ఆకులుపట్టుకున్నట్లు.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీ యువతి ఇప్పుడు పశ్చాత్తపం వ్యక్తం చేస్తోంది. తెలియక ఈ సంస్థలో చేరానని, తప్పైపోయిందంటూ కన్నీటి పర్యంతమవుతోంది.
2016లో జర్మనీకి చెందిన నలుగురు యువతులు ఇస్లామిక్ స్టేట్‌లో చేరారు. వీరిలో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు లిండ్ వెంజెల్. ప్రస్తుతం ఇరాక్ బలగాల అదుపులోకి వెళ్లి జైలులో ఉన్న లిండా తీవ్రంగా రోదిస్తోంది.

తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నానని, తాను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పుడు తనకు ఉన్న ఏకైక కోరిక అది మాత్రమే అని వెల్లడించింది.
ప్రస్తుతం జర్మనీ విదేశాంగ కార్యాలయం ఈమకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టింది. ఈమె కేసును టేకప్ చేసిన న్యాయవాది లోరెంజ్ హాసే మాట్లాడుతూ.. ఇరాక్‌లో గుర్తించిన లిండా వెంజెల్ కు ప్రస్తుతం కొంత సహాయం అందుతోందని చెప్పారు.
అయితే, ఆమె ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఇంకా తనకు కూడా స్పష్టంగా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. 'ఈ యుద్ధరంగం నుంచి, ఈ శబ్ధాల నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లండి. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నా ఇంటికి చేర్చండి..' అని లిండా చెప్పినట్లు డేర్ స్పైజెల్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications