షూటింగ్‌లో చనిపోతానని చెప్పి.. రియల్‌గా చనిపోయాడు

జోర్డాన్: అక్కడొక షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా ప్రముఖ అరబ్ నటుడు తాను చనిపోయే సంఘటనలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు తాను చనిపోతున్నట్లు తన సహచరులతో కెమెరా ముందు చెప్పాడు. ఆ సన్నివేశం బాగా పండటంతో సహచరులందరూ ఆయనకు అభినందనలు తెలిపారు.

అయితే సన్నివేశం చిత్రీకరణ అయిపోయినప్పటికీ ఆయన కళ్లు తెరవకపోవడం, కదలిక లేకపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే వారనుకున్నట్లే అతను నిజ జీవితంలోనూ తన జీవితాన్ని ముగించేశాడు. ఆ సన్నివేశంలోనే అతడు మృతి చెందాడు.

''I'm going to die soon'' Final words of actor who died in real life

ఈ సంఘటనలో మృతి చెందింది ప్రముఖ అరబ్ నటుడు మహ్ముద్ సవాల్క(55). జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో ఓ ప్రకటన చిత్రీకరణ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ‘నీ స్వహస్తాలతో నాకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి' అని ఆ సన్నివేశంలో నటిస్తూ.. తన కొడుకు(సన్నివేశంలో)తో తన చివరి డైలాగుగా చెప్పాలి.

అయితే అతను ‘నేను చనిపోతాననే భావన కలుగుతోంది. నేను కొన్ని క్షణాల్లో చనిపోతున్నాను' అని చెప్పాడు. కళ్లముందే తమ తోటి నటుడు చనిపోవడం మిగిలిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సవాల్క అనేక నాటకాలతోపాటు, బెడోయిన్ (దేశదిమ్మరుల) పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా, సవాల్క మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+