‘కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రి గడిపా’: చార్లీ

లండన్: తాను బ్రిటీష్ కేబినెట్ మంత్రి కూతురుతో ఓ రాత్రి గడిపినట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు షీన్. ఆ సమయంలో తన ఎదురుగా వందలమంది కూర్చుని ఉన్నారు. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ ఐవీ ఉందని గతంలో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ మధ్య తరుచూ ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాలు రాజేస్తున్న ఈ నటుడు ఈసారి ఏకంగా ఓ కేబినెట్ మంత్రినే లక్ష్యంగా చేసుకున్నారు. 'మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా' అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిచ్చారు.

Charlie Sheen

'అవును ఉన్నారు. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పారు. దీంతో అక్కడ కూర్చున్న వాళ్లంతా షాక్ అయ్యారు.

వెంటనే మోర్గాన్ ఆ మంత్రి ఎవరనే విషయం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేశారు. 'ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోనీ ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు?' అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.

దీనికి షీన్ స్పందిస్తూ.. తాను అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన.. ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారని బదులిచ్చారు. ఇప్పుడా మంత్రి ఎవరనేదానిపై అక్కడ విస్తృత చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+