'అతడు' ఆమెగా మారగానే అత్యాచారం జరిగింది
అమ్మాయి లక్షణాలు అధికంగా ఉన్న ఓ అబ్బాయి మహిళగా లింగమార్పిడి చేసుకొన్న తర్వాత అత్యాచారానికి గురయ్యాడు. మహిళ గా మారిన తర్వాత తనకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
లండన్ :లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారిన తర్వాత తాను అత్యాచారానికి గురయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స కూడ తీసుకోవాల్సి వచ్చిందని లారెన్ హరీష్ చెబుతోంది. లింగమార్పిడి చేసుకొన్న రక్షణ లేకుండాపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
లండన్ కు చెందిన లారెన్ హరీష్ అనే యువతి పుట్టినప్పుడు అబ్బాయిగానే పుట్టింది. అయితే ఆమెలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉండేవి. దీంతో చిన్నతనంలో స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఆమెను హేళన చేసేవారు.
ఎనిమిదేళ్ళ వయస్సులో తన ఇద్దరు సోదరులతో పాటు తాను ఎదగాల్సినంతగా ఎదగలేదని ఆమె చెప్పింది. ఆ సమయంలో తన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్తే తనలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు వివరించారు ఆమె గుర్తుచేసుకొంది.

ఈ కారణంగానే తాను చిన్నతనంలోనే తన సోదరులిద్దరూ ట్రక్కులు ఇతర బొమ్మలతో ఆడుకొంటూంటే తాను చైనా బొమ్మలతో ఆడుకొనేదని ఆమె చెబుతోంది. 16 ఏళ్ళ వయస్సు వచ్చాక కూడ తానేంటో ఏం కావాలనుకొంటున్నారో అర్థమయ్యేది కాదని ఆమె చెబుతోంది.
అయితే 12 ఏళ్ళ వయస్సునే పురాతన వస్తువుల నిపుణుడిగా లారేన్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే అతనిలో ఆమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉండడంతో తరచూ అవమానాలకు గురయ్యేవాడు.
ఈ అవమానాలను తట్టుకోలేదక హరీష్ మూడు దఫాలు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే ఆత్మహత్య తన సమస్యకు పరిష్కారం కాదని భావించాడు. ఈ మేరకు 2002 లో లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు.
అమ్మాయిగా మారిన తర్వాత అత్యాచారం జరిగింది
అమ్మాయి లక్షణాలతో పురుషుడిగా ఉన్న హారీష్ కు ఒకరకం కష్టాలను ఎధుర్కోన్నాడు. మరో వైపు అమ్మాయిగా మారిన తర్వాత భద్రత లేకుండా పోయిందని ఆమె ఆవేదన చెందింది. లండన్ లోని ఓ హోటల్ లో తాను ఉండగా అత్యాచారానికి గురయ్యాయని ఆమె చెప్పింది.ఈ సమయంలో ఆసుపత్రిలో చికిత్స కూడ చేసుకోవాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకొంది. ట్రాన్స్ జెండర్ టీవి పర్సనాలిటీగా, గాయనిగా పేరు సంపాదించుకొన్నట్టు ఆమె చెబుతోంది.మహిళగా మారాకే తాను పరిరూర్ణ జీవితం గడుపుతున్నట్టు ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications