• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోల్డ్ గాళ్.. లాక్ డౌన్‌లో విరహం తట్టుకోలేక.. అవసరమైతే అందుకు వెనకాడనని..

|

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇళ్లల్లో బందీ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రేమికులు,డేటింగ్‌లో ఉన్నవారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్ లేదా బాయ్‌ఫ్రెండ్స్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో తెగ బాధపడిపోతున్నారు. వీళ్లే కాదు అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నవారు సైతం.. ఎప్పుడెప్పుడు తమ భాగస్వాములను కలుస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ యువతి తన భాగస్వామి అయిన పారిశ్రామికవేత్తతో ఎఫైర్ కోసం లాక్ డౌన్ నిబంధనలను సైతం ఉల్లంఘించడానికి వెనుకాడనని వ్యాఖ్యానించింది. దీనిపై డైలీ మెయిల్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ఎవరా మహిళ..

ఎవరా మహిళ..

బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌కి చెందిన మేరీ(31) అనే జిమ్ వర్కర్ లాక్ డౌన్‌లో పీరియడ్‌లో తన భాగస్వామి మిస్ అవుతున్నట్టుగా వెల్లడించింది. పారిశ్రామికవేత్త అయిన తన భాగస్వామి లాక్ డౌన్ పీరియడ్‌లో తన వ్యాపారాలు మూతపడటంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు పేర్కొంది. అతనికున్న ఒకే ఒక్క స్ట్రెస్ బస్టర్ తానేనని.. లాక్ డౌన్ కారణంగా ఇద్దరం కలిసే అవకాశం లేకపోవడంతో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని తెలిపింది. గతంలో వారానికి రెండుసార్లయినా తామిద్దరం శృంగారంలో పాల్గొనేవారమని.. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడుకోవడం,చూసుకోవడమే సరిపోతుందన్నారు.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించేందుకు వెనుకాడనని..

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించేందుకు వెనుకాడనని..

తన భాగస్వామితో దూరంగా ఉండటాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని.. అవసరమైతే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సైతం అతన్ని కలుస్తానని మేరీ పేర్కొంది. నిజానికి తన భాగస్వామికి పెళ్లి అయిందని.. భార్య కూడా ఉందని వెల్లడించడం గమనార్హం. అయితే శృంగారపరంగా ఆమెకు ఆసక్తి లేకపోవడంతో అతను తనతో కనెక్ట్ అయినట్టు తెలిపింది. ఓ ఆన్‌లైన్ అక్రమ సంబంధాల సైట్ ద్వారా తామిద్దరు కలుసుకున్నట్టు వెల్లడించింది. 'నాతో ఎఫైర్ కొనసాగిస్తూ.. భార్యను అతను మోసం చేస్తున్నందుకు నేనేమీ విచారించట్లేదు.' అని చెప్పింది.

మొదటి నుంచి బోల్డ్ గాళ్..

మొదటి నుంచి బోల్డ్ గాళ్..

స్కూల్ వయసు నుంచే తాను చాలా బోల్డ్ అని చెప్పిన మేరీ.. తమ స్కూల్లో మొదటిసారి వర్జినిటీ కోల్పోయింది కూడా తానే అని చెప్పింది. అంతేకాదు,కేవలం 20 ఏళ్ల వయసుకే తాను సుమారు 100 మంది మగాళ్లతో శృంగారంలో పాల్గొన్నట్టు పేర్కొంది. పెళ్లయ్యాక వేరే వ్యక్తితో సంబంధాన్ని భర్త బట్టబయలు చేయడంతో విడాకులు తీసుకున్నట్టు తెలిపింది. తానెప్పుడూ ఒకరికే పరిమితం కావాలనుకోలేదని.. అందుకే వివాహ బంధం నుంచి బయటకొచ్చానని చెప్పింది. అయితే ఒక సమయంలో ఒకరితో మాత్రమే సంబంధం కొనసాగించాలనుకుంటున్నానని.. ఇప్పుడైతే ఆ పారిశ్రామికవేత్తతోనే కొనసాగుతానని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా అటు వ్యాపారాల్లో నష్టాలు,ఇటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల్లో ఉన్న అతన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టలేనని చెప్పింది.

English summary
A woman who has been continuing an affair with a married man during the UK coronavirus lockdown warns they have no choice but to break social distancing rules soon - as virtual sex is "no substitute for real thing".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X