ఇస్లామిక్ స్టేట్ జీహాదీ జాన్ అంటే నేనే
ఇరాన్: కరుడుకట్టిన ఉగ్రవాది జీహాదీ జాన్ ఎట్టకేలకు అతని ఫేస్ ప్రపంచానికి చూపించాడు. తన రాక్షసత్వంతో ఇంత కాలం ముసుగులు వేసుకుని చెలరేగిపోయిన జీహాదీ జాన్ ముఖం చూపించాడు. తీవ్రవాదం పేరుతో అందరిని దడపుట్టించడంలో ఇతను ముందుంటాడు.
కోడిని కోసినంత సులభంగా మనుషుల తలలు నరకడం అంటే జీహాదీ జాన్ కు భలే సరదా. బ్రిటన్ జాతీయుడైన అతని అసలు పేరు మహమ్మద్ ఎమ్వాజీ. కాని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇతనిని జీహాదీ జాన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
అమెరికన్ జర్నలిస్టులు జేమ్స్ ఫోలే, స్టీవెన్ సోల్టో, బ్రిటిష్ స్వచ్చంద సేవకులు డేవిడ్ హెయినెస్, అలెన్ హెన్నింగ్, జపాన్ జర్నలిస్ట్ కెంజీ గోటో తదితర విదేశీయులను అత్యంత దారుణంగా పీకలు కోసి చంపిన ఈ జీహాదీ జాన్ ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

ట్రక్కులు పేల్చుతున్న వీడియోలను ఆదివారం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విడుదల చేశారు. అందులో జీహాదీ జాన్ ముఖం స్పష్టంగా కనపడుతున్నది. విడుదలైన ఆ వీడియోలో జీహాదీ జాన్ మాట్లాడుతున్నమాటలు రికార్డు అయ్యాయి.
"నేను మహమ్మద్ ఎమ్వాజీని, అతి త్వరలో లండన్ తిరిగోస్తా, అక్కడ కూడ తలల నరికివేతను కొనసాగిస్తా" జాగ్రత అంటు బ్రిటీష్ యాసలో మాట్లాడాడు. జీహాదీ జాన్ ను అంతం చెయ్యాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జాహాదీ జాన్ ముఖం బయటకు రావడంతో లండన్ పోలీసులు అతని పుట్టుపూర్వత్తరాలు బయటకు లాగుతున్నారు.












Click it and Unblock the Notifications