వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ వల్లే ఆ 'షో'కు ఆర్నాల్డ్ గుడ్ బై: రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్..

'ట్రంప్ ఇప్పటికీ ఈ షోకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండటం మరియు దీని ద్వారా ఆయన ఇంకా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలియడంతో.. చాలామంది ఈ షో ను బాయ్ కాట్ చేశారు' అంటూ ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'ద న్యూ సెల‌బ్రిటీ అప్రెంటిస్' అనే షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జనేగర్ ఆరోపించారు.

రేటింగ్స్ కు ట్రంప్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా?.. ఈ షోకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ట్రంప్ కొనసాగుతున్నారు. గతంలో ట్రంప్ ను పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్నాల్డ్.. ఇప్పటికీ ఆయనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతుండటం పట్ల అసహనంతో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ వ్యూయర్స్ పై పడటంతో రేటింగ్స్ పడిపోయాయని ఆర్నాల్డ్ అంటున్నారు.

ఆర్నాల్డ్ హోస్ట్ గా వ్యవహరించిన ఇటీవలి 'ద న్యూ సెల‌బ్రిటీ అప్రెంటిస్' షో కు కేవలం 5మిలియన్ల వ్యూయర్స్ నుంచి మాత్రమే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 'షో'కు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండటంతో పలు సంస్థలు కూడా స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆర్నాల్డ్ చెప్పారు.

I wont be back, Arnold Schwarzenegger blames Donald Trump for Celebrity Apprentice decline

'ట్రంప్ ఇప్పటికీ ఈ షోకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండటం మరియు దీని ద్వారా ఆయన ఇంకా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలియడంతో.. చాలామంది ఈ షో ను బాయ్ కాట్ చేశారు' అంటూ ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటిదాకా ఈ షోలో చేసిన ఎపిసోడ్స్ అన్ని తనకు సంతృప్తినిచ్చాయని, టీమ్ అందరితోను స్నేహపూర్వకంగా పనిచేశానని ఆర్నాల్డ్ అన్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక ఈ షోను మళ్లీ చేయదలుచుకోలేదని ఆర్నాల్డ్ స్పష్టం చేశారు.

English summary
Arnold Schwarzenegger has announced he will leave his role as host of "The New Celebrity Apprentice" and blamed President Donald Trump for the show's recent poor performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X