మీలాగే మేం: ట్రంప్‌కు లేఖ, షాకిచ్చిన ఐబీఎం ఉద్యోగిని
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని అభినందిస్తూ ఐబీఎం సీఈవో రొమెట్టి లేఖ రాశారు. దీనిని నిరసిస్తూ ఎలిజబెత్ వుడ్ అనే ఉద్యోగిని కంపెనీకి రాజీనామా చేశారు.
వాషింగ్టన్: ఐబీఎం సీఈవోకు ఓ ఉద్యోగిణి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని అభినందిస్తూ ఐబీఎం సీఈవో రొమెట్టి లేఖ రాశారు. దీనిని నిరసిస్తూ ఓ ఉద్యోగిని కంపెనీకి రాజీనామా చేశారు. ఆమె పేరు ఎలిజబెత్ వుడ్.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడాన్ని అభినందించడమే కాకుండా, ఆయన విధానాలతో తాము ఏకీభవిస్తున్నామని ఐబీఎం చీఫ్ పేర్కొన్నారు. ముస్లిం, వలసవాదులు, లాటిన్ అమెరికన్ల పట్ల ట్రంప్ అనుసరించనున్న విధానాలనే తమ కంపెనీలో అనుసరిస్తామని లేఖలో పేర్కొన్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే చర్యలో తాము తోడ్పాటునందిస్తామని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ విధానాలకు తమ సీఈవో మద్దతు పలకడాన్ని సహించలేని కంపెనీలోని సీనియర్ ఉద్యోగిని అయిన ఎలిజబెత్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇంతకాలం కంపెనీ వృద్ధిలో చేదోడు వాదోడుగా నిలుస్తున్న, వలసవాదులుగా పేర్కొంటున్న నల్ల జాతీయులు, ముస్లింల పట్ల ఇలాంటి వైఖరిని అవలంబిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగుల మనోభావాలను గుర్తించకుండా లేఖ రాయడాన్ని తప్పుపట్టింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications