టీనేజ్ బాలుడితో మంత్రి వివాహేతర సంబంధం.. 30 ఏళ్ల తర్వాత పదవికి రాజీనామా!

Iceland Minister Resignation: మూడు దశాబ్ధాల క్రితం మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం వల్ల ఐస్‌లాండ్ మంత్రి ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ తన రాజకీయ జీవితాన్ని కోల్పోయింది. 16 ఏళ్ల బాలుడితో తాను గతంలో బిడ్డకు జన్మనిచ్చానని అంగీకరించిన తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 30 ఏళ్ల క్రితం చేసిన తప్పు వల్ల ఆమె పదవి పోయింది. ఆమె చేసిందల్లా ఏంటంటే.. 15 ఏళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం. ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం చెలరేగడంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఐస్‌లాండ్ కు చెందిన మంత్రి ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు కాగా.. 30 ఏళ్ల క్రితం 16 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తాను 22 ఏళ్ల వయస్సులో ఉండగా.. టీనేజ్ బాలుడితో పెట్టుకున్న సంబంధం కారణంగా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇంతకాలం పాటు ఆ బిడ్డకు కన్నతండ్రి ఎవరో తెలియనివ్వకుండా పెంచారు. కనీసం అతడిని కలవనివ్వకుండా.. మాట్లాడనీయకుండా చేయడంతో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. అయినా లాభం లేకపోవడంతో ... ఇటీవలే ఆ వ్యక్తి బంధువు విషయాన్ని మీడియా ముందు పెట్టగా.. మంత్రి తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. 30 ఏళ్ల క్రితం చేసిన ఒక్క తప్పు వల్ల మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.

Iceland Minister Resigns After Admitting Affair with Teenage Boy 30 Years Ago

22 ఏళ్ల వయస్సులో ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ ఓ మతపరమైన వర్గానికి కౌన్సిలర్ గా పని చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న 16 ఏళ్ల బాలుడు అస్ముండ్సన్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నేళ్ల పాటు ఈ బంధాన్ని కొనసాగించగా.. దానికి ఫలితంగా ఆమె గర్భం దాల్చారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో బిడ్డ పుట్టాడు. అనంతరం ఏడాది పాటు ఒకే చోట ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత తన బిడ్డను చూడనివ్వకుండా ఇబ్బందులు పెట్టిందని అస్ముండ్సన్ ఆరోపించారు. బిడ్డ పుట్టిన ఏడాది వరకు కలిసే ఉన్నామని.. ఆ తర్వాతే దూరం పెట్టడం ప్రారంభించిందని చెప్పారు. బిడ్డ కోసం 18 ఏళ్లు న్యాయం పోరాటం కూడా చేసినట్లు వివరించారు. కుమారుడి సంరక్షణ కోసం డబ్బులు కూడా చెల్లించానని చెప్పారు. అయినప్పటికీ తన బిడ్డను కలిసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు.

అనంతరం అస్ముండ్సన్ బంధువు ఒకరు దేశ ప్రధానికి విషయం వివరించారు. ఆస్టిల్డర్ మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిందని.. అప్పుడు వారికి ఒక బిడ్డ పుట్టిందన్నారు. ఈ క్రమంలో ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ తరుణంలో మంత్రి స్పందించాల్సి వచ్చింది. ఆమె తన తప్పును ఒప్పుకోవడంతో తీవ్ర విమర్శలు రాగా.. తన పదవికి రాజీనామా చేశారు. ఐస్‌లాండ్ చట్టాల ప్రకారం.. ఒక మైనర్ తో గురువు లేదా సంరక్షకులు వివాహేత సంబంధం పెట్టుకోవడం నేరంగా భావిస్తారు. అలా చేసిన వారికి మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మంత్రి మంత్రికి ఏ శిక్ష విధిస్తారో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+