సహజీవనం చేస్తే అక్కడ బహిరంగంగా బెత్తం దెబ్బలు !
జకార్తా : పెళ్లి కాకుండానే అక్కడ సహజీవనం చేశారో .. ఇక అంతే సంగతులు. మీరు బెత్తం దెబ్బలు తినేందుకు రెఢీగా ఉండాలి. స్థానికులు సమాచారం అందించినా చాలు, సహజీవనం చేసే వారి వీపు విమానం మోత మోగాల్సిందే.
సహజీవనానికి షరియా నో
పెళ్లికాకుండా సహజీవనం చేయడానికి ఇస్లాం అంగీకరించదు. షరియా చట్టాన్ని తు.చ తప్పకుండా కొన్ని ముస్లిం దేశాలు అమలు చేస్తుంటాయి. అందులో ఇండోనేషియా ఒకటి. ఇటీవల సహజీవనం చేస్తూ పట్టుబడిన ఐదు జంటలకు పోలీసులు బెత్తం దెబ్బలు రుచి చూపించారు. వీరిలో నాలుగు జంటలు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తుండగా, మరో జంట బహిరంగ ప్రదేశంలో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డారు.

100 బెత్తం దెబ్బలు
పెళ్లికాకుండా సహజీవనం చేసేవారికి ఇండోనేషియాలో జైలుశిక్ష కూడా పడుతోంది. ఆ ఐదు జంటలు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత .. ఓ మసీదు ఆవరణలో ఒక్కొక్కరిని బెత్తంతో కొట్టారు. ఒక్కొక్కరిని 4 నుంచి 22 దెబ్బలు కొట్టారు. మరోవైపు డిసెంబర్‌లో బాలికలతో గడిపినందుకు ఇద్దరు యువకులను 100 బెత్తం దెబ్బలతో కొట్టి కఠినంగా శిక్షించారు.












Click it and Unblock the Notifications