నవాజ్ షరీఫ్, కూతురు మరియంకు ఇస్లామాబాద్ కోర్టులో భారీ ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు, ఆయన కూతురు మరియం షరీఫ్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. వీరితో పాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్దర్‌కు కూడా కోర్టులో రిలీఫ్ లభించింది. వీరికి శిక్ష విధిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది.
ఈ ఏడాది జూలై ఆరో తేదీన అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది. దీంతో వారు విడుదలయ్యే అవకాశముంది.

కాగా, నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష, ఆయన కూతురు మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియంను నేషనల్ అకౌంటబులిటీ కోర్టు దోషులుగా తేల్చింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో ఈ శిక్ష పడింది.
నవాజ్ షరీఫ్ అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఈ తీర్పు వచ్చింది. షరీఫ్ పైన మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి.
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications