రష్యన్ స్వలింగ సంపర్క జంట చిత్రానికి పురస్కారం, అందుకే...
ది హేగ్: ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో పురస్కారాన్ని ఈ ఏడాది రష్యాకు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటో గెలుచుకుంది. ఈ ఫోటోను డెన్మార్క్‌లోని ఓ దినపత్రిక ఫోటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ తీశారు. రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ఫోటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.

సమకాలీన సమస్య విభాగంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటోను ఎంపిక చేసినట్లు చెప్పారు. వార్తల విభాగంలో ఇస్తాంబుల్‌లో నిరసనల సమయంలో టర్కీకి చెందిన బులెంట్ కిలిక్ తీసిన ఫోటోకు మొదటి బహుమతి వచ్చింది. ఈ పోటీలకు వివిధ రకాల అంశాలపై వేలాది ఫోటోలు వచ్చాయి.
పాత్రికేయుడు బాబ్ సైమన్ మృతి
యుద్ధవార్తల రిపోర్టింగ్‌లో అవార్డు గ్రహీత, ‘60 మినిట్స్' న్యూస్‌షోకు దీర్ఘకాలం కరస్పాండెంట్‌గా పనిచేసిన బాబ్ సైమన్(73) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కారు వేరొక వాహనాన్ని ఢీకొట్టిందని ‘న్యూయార్క్ పోస్ట్' తెలిపింది. అయిదు దశాబ్దాల పాత్రికేయ వృత్తిలో ఆయన వియత్నాం యుద్ధం గురించి పలు కథనాలు అందించారు.












Click it and Unblock the Notifications