ఫోటో షూట్ కోసం ఉద్యోగి కోటు అడిగి తీసుకున్న ఇమ్రాన్ ఖాన్
కరాచి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, పీటీఐ అధ్యక్షులు తన పక్కన ఉన్న ఓ ఉద్యోగి కోటు అడిగి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటో దిగడం కోసం ఇమ్రాన్ ఖాన్ కాసేపు సదరు ఉద్యోగి కోటును అడిగి తీసుకున్నారు.
సోమవారం ఇమ్రాన్ ఖాన్ తెలుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకొని జాతీయ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ రిజిస్ట్రేషన్ కార్డు తీసుకోవడం కోసం ఆయన ఫొటో దిగవలసి వచ్చింది. అందుకు జాతీయ అసెంబ్లీలో పనిచేసే ఓ ఉద్యోగి వేసుకున్న నలుపు రంగు కోట్‌ను తీసుకున్నారు.

ఆ కోటు ధరించేందుకు ఆ ఉద్యోగి ఇమ్రాన్ ఖాన్‌కు సహకరించారు. దానిని ధరించి తర్వాత ఆయన స్టూల్‌పై కూర్చుని ఫొటో దిగారు. కాగా, 15 జాతీయ అసెంబ్లీ తొలి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిల్వాల్ భుట్టో జర్దారీతో కరచాలనం చేసి ఆయనతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ఫొటో దిగారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
In love with this clip
— Ali Arif 🇵🇰 (@i_aliarif) August 13, 2018
NA's official photographer gave his waist coat to Imran Khan for his picture.#ImranKhan #PrimeMinisterImranKhan #NationalAssembly # pic.twitter.com/VBFHFKtt4K
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications