వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవాజ్ షరీఫ్ పనికిరాడు: పాక్ కు అవసరమా, ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కాశ్మీర్ (ఎల్వోసీ)లో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేశామంటూ భారత్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పూర్తిగా విఫలం అయ్యారని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్షాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ వెంటనే పాక్ ప్రధాని పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్బంలో నవాజ్ షరీఫ్ పరిస్థితులు చక్కదిద్దకుండా లండన్ లోని గుక్సీలో షాపింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నవాజ్ షరీఫ్ పనామా కుంబకోణంలో ఇరుకున్నాడని ఆరోపించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ మీద ఆరోపణలు చేస్తుంటే వాటిని తిప్పికొట్టకుండా నవాజ్ షరీఫ్ చోద్యం చూస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి పనికిమాలిన నాయకుడు మనకు అవసరామా అని ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలను ప్రశ్నించారు.

Imran Khan calls on PM Nawaz Sharif to resign over charges of money laundering

భారత్ ఎల్వోసీలో దాడులు చెయ్యలేదని నవాజ్ షరీఫ్ ఒక్క ఆధారం చూపలేకపోయారని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతచొరవ తీసుకోవడానికి నవాజ్ షరీఫ్ చేతకాని తనమే అని మండిపడ్డారు.

నవాజ్ షరీఫ్ భారత్ వెళ్లి అక్కడి వ్యాపారులు, రాజకీయ నాయకులతో తేనేటి విందులో పాల్గొంటున్నారని దుమ్మెత్తిపోశారు. నవాజ్ షరీఫ్ విదేశీ యాత్రల పేరుతో ఇప్పటి వరకు రూ. 80 కోట్ల వరకు తగలేశారని ఆరోపించారు.

బచ్చాఖాన్ విశ్వవిద్యాలయంలో 19 మంది విద్యార్థుల మరణానికి నవాజ్ షరీఫ్ కారణం అయ్యారని విమర్శించారు. హురియత్ నేతలతో మాట్లాడటానికి నవాజ్ షరీఫ్ కు సమయం ఉండదని, మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్లి రావడానికి టైం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

English summary
Imran Khan said, We believe Nawaz Sharif has lost legitimacy as PM. He promised to present himself before parliament for accountability six months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X