Crime News: ఉద్యోగం మానేస్తామని చెప్పినందుకు 8 మంది ఉద్యోగుల హత్య..
ఉద్యోగం మానేస్తామని చెప్పినందుకు 8 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మెక్సికోలో జరిగింది. రియల్ ఎస్టేట్ స్కామ్‌లో అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌లో ఈ హత్యలు జరిగాయి. హత్యకు గురైన వారిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మెక్సికోలోని గువాడలజరాలో జలిసో అనే సంస్థ న్యూ జనరేషన్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ నిర్వహిస్తోంది.
మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్ నడుస్తోంది. మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. జలిసో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్‌లు చేస్తోంది. తెలిసో తెలియకో కార్టెల్‌లో పనిచేసిన వారు ఆ గ్యాంగ్ నుంచి బయటపడాలంటే మరణమోనని చెబుతుంటారు. అందులో పని చేస్తున్న 8 మంది మే 20, 22 మధ్య తప్పిపోయారు.

దీంతో మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల్లో మృతదేహ భాగాలు లభ్యమయ్యాయి. శరీర భాగాలను ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదికలో ఆ శరీర భాగాలు తప్పిపోయిన వారివేనని తేలింది. 8 మంది హత్యకు గురయ్యారని అమెరికా, మెక్సికో అధికారులు తెలిపారు. అయితే వీరిని జాబ్ మానేస్తునందుకే హత్య చేశారా.. మరేదైనా కారణం ఉందో పోలీసులు విచారిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లో ఇంగ్లీష్ నేర్చుకుని మెక్సికోకు తిరిగి వచ్చిన యువకులు లేదా వలసదారులకు మెక్సికోలో కాల్ సెంటర్‌లు ప్రధాన ఉపాధి వనరుగా ఏప్రిల్‌లో US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ జాలిసో న్యూ జనరేషన్ కార్టెల్ సభ్యులు లేదా సహచరులకు వ్యతిరేకంగా ఆంక్షలు ప్రకటించినప్పుడు వీరి మోసాలు బయటకు వచ్చాయి.
-
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications