zombie drug: లాస్ ఏంజిల్స్ ను వణికిస్తున్న జాంబీ డ్రగ్.. ఇది తీసుకుంటే పైకి పోవడమే ఇక..!
అమెరికాలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే డ్రగ్స్ లో ప్రాణాంతక జైలజైన్ అనే మత్తుపదార్థం ఉంది. దీనికి బానిసలైన వారి ఇది భయంకరమైన ప్రభావం చూపుతుంది. జైలజైన్ అనే మందును ఆవులు గుర్రాల్లో ఉద్రేకాన్ని తగ్గంచేందుకు వాడుతారు.
ఈ మత్తు పదార్థాన్ని ట్రాంక్ అని కూడా పిలుస్తారు. ఇది నిషేధిత జాబితాలో లేకపోవడంతో విచ్చలవిడిగా వాడుతున్నారు. హెరాయిన్, ఫెంటానైల్ లో జైలజైన్ కలుపుతున్నారు. ఇలా వాడడడం వల్ల శరీరం దుష్పప్రభవం చూపుతుంది.

శరీరంపై పుండ్లు కావడం, చర్మం కుళ్లిపోవడం జరుగుతుందట. మోతాదు ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందట. ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడంతో రక్తనాళాలను బలహీన పరిచి రక్తం సరఫరా మందగించేలా చేస్తుందని అక్కడి అధికారులు చెబుతు్నారు.
చర్మాన్ని కుళ్లించే ప్రభావం ఉండటంతో దీన్ని మాంసభక్షక డ్రగ్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇది పీల్చిన వారు మితిమీరిన మత్తులో ఉండటం వల్ల దీన్ని జాంబీ డ్రగ్ అని కూడా అంటారట. "ఇది నిజంగా భయంకరంగా ప్రజలను వికృతీకరిస్తోంది" అని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఏజెంట్ బిల్ బోడ్నర్ అన్నారు.
"జైలాజైన్‌తో పాటు వచ్చేవి వాసోకాన్‌స్ట్రిక్టర్. కాబట్టి మీరు దానిని ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు, ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది" అని అధికారి తెలిపారు. ఏప్రిల్ లో క్రైమ్ ల్యాబ్ విశ్లేషకులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో జైలాజైన్ ఉన్నట్లు గుర్తించారు. "గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో, మేము నకిలీ ఫెంటానిల్ మాత్రలలో జిలాజైన్ గుర్తించామని" అని US డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ డివిజన్ ప్రతినిధి నికోల్ నిషిదా తెలిపారు.
గత ఏడాది స్వాధీనం చేసుకున్న ఫెంటానిల్ పౌడర్‌లో 23 శాతం, ఫెంటానిల్ మాత్రలలో 7 శాతం జిలాజైన్ కలిగి ఉన్నట్లు ఫెడరల్ డేటా తెలుపుతుంది. జైలజైన్‌ను ఫెంటానిల్‌తో కలపడం వల్ల దేశం ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రాణాంతకమైన డ్రగ్స్ ముప్పును మరింత ఘోరంగా మారుస్తోందని యుఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ మిశ్రమం వినియోగదారులకు ప్రాణాంతకమైన డ్రగ్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.
పుండ్లు ఏర్పడే వ్యక్తులపై Xylazine తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది లేదా కొన్ని సందర్భాల్లో ఒక అవయవాన్ని కూడా కోల్పోవచ్చని హెచ్చరించింది."తమ వద్దకు ఒక మహిళ వచ్చింది. ఆమె సోదరి ఫెంటానిల్ అధిక మోతాదు తీసుకోవడం వల్ల మరణించింది" అని వ్యసన నిపుణులు కారీ క్వాషెన్ ది హిల్‌తో చెప్పారు. "కానీ అది ఫెంటానిల్ ఓవర్ డోస్ మాత్రమే కాదు (కానీ) ఆమె చర్మం కుళ్ళిపోవడం, ఆమె కాలు, ఆమె చేతిపై కండరాలు కుళ్ళిపోయాయని. కనుక ఇది జైలాజైన్ వల్లే ఇలా జరిగింది" అని తెపిపింది.












Click it and Unblock the Notifications