ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్
న్యూజిలాండ్ : న్యూజిలాండ్ మసీదుల్లో మారణహోమం సృష్టించిన దుండగుడు బ్రెంటాన్ టారాంట్ నరనరాన జాత్యాంహకారం జీర్ణించుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పశ్చిమ దేశాల్లో ఇతరదేశాల వారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని .. వీరిని ఇక్కడినుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని 74 పేజీల మేనిఫెస్టో లో పేర్కొన్నాడు. మసీదుల్లో దాడి చేసే ముందు తన వైఖరి స్పష్టంచేస్తూ మేనిఫెస్టోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తన వర్ణ వివక్షను చాటుకున్నాడు.

మా పౌరులు కాదు .. కదా ..?
ముఖ్యంగా ఇండియా, చైనా, టర్కీ దేశాలకు చెందిన వారు పశ్చిమ దేశాలకు శత్రువలను విషం కక్కాడు. 74 పేజీల్లో మేనిఫెస్టో లో తమ దేశాల్లో ఇతరులకు స్థానం లేదని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో అప్ లేడ్ చేసిన మేనిఫెస్టోకు 'ద గ్రేట్ రిప్లేస్ మెంట్‘ 'ద ఇన్వాడర్స్ మస్ట్ బీ రిమూవుడ్ ఫ్రం యూరోపియన్ సాయిల్‘ అనే పేరు పెట్టాడు. 'వారు ఎక్కడి నుంచి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారని .. ఈ మూడు దేశాలతోపాటు రోమ, ఆఫ్రికా, సెమిటిక్ దేశాలవారిని ప్రశ్నించాడు. 'వారు మా దేశ పౌరులు కాదు, కానీ మా భూభాగంలో నివసిస్తున్నారు, వారిని ఇక్కడినుంచి పంపించాల్సిన అవసరం ఉందని‘ తన తోలుమందాన్ని చాటుకున్నాడు.

నరనరాన జాత్యాంహకారం ..
మేనిఫెస్టో తో బ్రెంటాన్ వైఖరి స్పష్టమవుతోంది. అతని తీవ్రవాద భావజలానికి ఆకర్షితుడై .. వారి ఆలోచనలను ప్రభావితమయ్యాడు. ఆ మేరకు తమ దేశానికి వలసవచ్చిన వారు వెళ్లిపోవాలని రాశాడని అర్థమవుతోందని న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ తెలిపారు. ర్యాడికలిజానికి ప్రభావితమైన ..బ్రెంటాన్ మసీదులు లక్ష్యంగా దాడికి తెగబడినట్టు స్పష్టమవుతోందన్నారు.

డామినేట్ చేస్తారని భయం ...
తమ భూభాగల్లోకి ఇతరదేశస్థులను ఇలానే అనుమతిస్తే 2028-2038 వరకు ఇతరులే ఎక్కువగా ఉంటారని పేజీ నంబర్ 63లో బ్రెంటాన్ పేర్కొన్నాడు. దీంతో వలసవచ్చిన వారి జనాభా శాతం ఎక్కువవుతోందని ఆందోళన చెందాడు. అందుకోసమే వారిపై దాడి చేయాలనే ఆలోచన చేసినట్టు మేనిఫెస్టో ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

పోటీలో నిలుస్తారని వణుకు ....
యూరప్ లోకి చైనా, టర్కీ, ఇండియన్ల ప్రవేశానికి అనుమతిస్తే తమకే నష్టమని పేర్కొన్నారు. తమ ప్రధాన శత్రువులైన ఈ దేశాల అభివృద్ధి యూరప్ కు విఘాతంగా మారుతోందని అంచనా వేశారు. దీంతో ఆ సమయంలో యూరప్ కు .. ఈ మూడు దేశాలతో ప్రచ్ఛన్న యుద్ధం జరుగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పుడు తమ ప్రత్యర్థి దేశాలే డామినేట్ చేసే సిచుయేషన్ వస్తోందని .. అందుకే దాడికి తెగబడినట్టు చెప్పకనే చెప్పాడు. ఈ 74 పేజీల మేనిఫెస్టో ప్రశ్న, సమాధానం మాదిరిగా రూపొందించాడు. అందులో భాగంగానే మసీదులపై దాడి చేయాలనే ప్రణాళిక రచించి .. దాడికి తెగబడ్డాడు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications