Number Plate: నంబర్ ప్లేట్‍కు రూ.122 కోట్లు.. ఇది నిజమే..!
కొంత మంది అందరిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అందుకోసం విభిన్నమైన వస్తువులు, ఖరీదైన వాహనాలు వాడుతుంటారు. మరి కొందరు తమకు కలిసొచ్చే వాటిని కొంటుంటారు. ఎంత ఖరీదైనా సరే వెనకాడకుండా కొనుగోలు చేస్తుంటారు. టాప్ యాక్సెసరీలు, ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తారు. వాటి నెంబర్లకు కూడా కోట్లు ఖర్చు చేస్తారు.
తాజాగా ఓ వ్యక్తి తన కారు నెంబర్ ప్లేట్‌పై ప్రపంచంలోనే ఎవరూ పెట్టనంత ఖర్చు పెట్టి రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నెంబర్ ప్లేట్‌ను రూ.122 కోట్లకు విక్రయించి గిన్నిస్ రికార్డు సృష్టించారు.

దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ వేసిన వీఐపీ నెంబర్ ప్లేట్ల వేలంలో 'పీ7' అనే కారు నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్ (సుమారు రూ.122కోట్లు)లకు అమ్ముడు అయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఇదే అత్యధికం. ఈ కార్ల నెంబర్ ప్లేట్ల వేలాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది పేదలకు ఆహారం అందించే లక్ష్యంతో ఎమిరేట్స్ ఆక్షన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 100 మిలియన్ ఏఈడీ (దిర్హామ్)లను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రొగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు.
'పీ7' తరహాలోనే 'AA22' నంబర్ ప్లేట్ కూడా సుమారు రూ.18కోట్లకు అమ్ముడుపోయింది. ఏఏ19కు సుమారు రూ.10కోట్లకు అమ్ముడు పోగా.. హెచ్31, డబ్ల్యూ78, ఎన్41, ఎక్స్36, జెడ్37, ఏఏ80 నంబర్ ప్లేట్లు కూడా భారీ ధరకు విక్రయించినట్లు నిర్వహకులు తెలిపారు.P7 కారు నంబర్ ప్లేట్ కోసం వేలం పాట 15 మిలియన్ AED వద్ద ప్రారంభమైంది.
సెకన్లలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ AEDని దాటింది. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని అయిన ఫ్రెంచ్ ఎమిరాటీ వ్యాపారవేత్త పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ AED తో వేలం వేశారు. ఆ తర్వాత ఒక దశలో బిడ్డింగ్ కొంతసేపు ఆగిపోయి, చివరికి బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్‌ల వద్ద ముగిసింది. అయితే నంబర్ ప్లేలో ఎవరు గెలిచారనేది మాత్రం వెల్లడించలేదు.
జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక ఇతర VIP నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్‌లు కూడా వేలం వేశారు. ఈ వేలంలో ప్రత్యేకమైన మొబైల్ నంబర్ల వేలంతో కలిపి మొత్తం 97.92 మిలియన్ దిర్హామ్‌లు వచ్చాయి.












Click it and Unblock the Notifications