పుతిన్, రష్యా ప్రజలను లేపేస్తాం: ఐఎస్ఐఎస్
సిరియా: రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు రష్యా ప్రజలను వదిలిపెట్టబోమని, కచ్చితంగా అందరి మీద పగ తీర్చుకుంటామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించారు. మీకు శాంతి అనేది లేకుండా చేస్తామని అంటున్నారు.
రష్యా జాతీయులు అందరిని చంపేస్తామని చెప్పారు. సిరియాలో మీ సైనికుల దాడిలో (రష్యా సైనికులు) చనిపోయిన ప్రతి కుమారుడికి, ధ్వంసం అయిన ప్రతి ఇంటికీ బదులుగా తాము మీ మీద ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఎనిమిది నిమిషాల నిడివిగల ఆ వీడియోను ఇస్లామిక్ స్టేట్ మీడియా చానెల్ విడుదల చేసింది. అందులో రష్యా గుడాచారిగా అనుమానిస్తున్న ఓ యువకుడి గొంతును కత్తితో కోసివేసిన దృశ్యాలు ఉన్నాయి.

ఆ అనుమానిత గుడాచారి హత్యకు గురికాక ముందు ఆ వీడియోలో ఆరు నిమిషాలు మాట్లాడాడు. తాను రష్యా గుడాచారిగా పని చేస్తున్నానని అంగీకరించాడు. అంతే కాకుండ తాను ఐఎస్ఐఎస్ రహస్యాలను సేకరించి రష్యాకు అందిస్తున్నానని ఒప్పుకున్నాడు.
అనంతరం ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది (రష్యా జాతీయుడు) ఆ వీడియోలో రెండు నిమిషాలు మాట్లాడాడు. తాము రష్యాను అంత తేలికగా వదిలి పెట్టబోమని హెచ్చరించాడు. వీరిద్దరూ రష్యా బాషలోనే ఆ వీడియోలో మాట్లాడారు.
అయితే గూడాచారి హత్యకు గురైన విషయంపై రష్యా ప్రభుత్వం, అక్కడి అధికారులు స్పందించలేదు. ఇటివల రష్యా విమానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేల్చివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రష్యా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మీద వైమానిక దాడులు చేస్తున్నది.












Click it and Unblock the Notifications