భారత్ వద్దన్నా ట్రంప్ వినట్లేదు..!!

భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత వైఖరిని ప్రదర్శిస్తోన్నారు. భారత్ తో కుదుర్చుకోవడం సహా పలు అంశాలపై ఆయన పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నిలిపివేశానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొన్న ఆయన.. దాన్నే తాజాగా పునరుద్ఘాటించారు.

పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేయడానికి ట్రేడ్ డీల్ ను తెర మీదికి తెచ్చినట్లు గతంలో పలుమార్లు చెప్పుకొంటూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ వంటి విదేశీ పర్యటనల సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రేడ్ డీల్ ను కుదుర్చుకోబోమంటూ అప్పట్లో హెచ్చరించారు.

India and Pakistan would have been a nuclear war within another week says Donald Trump

భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని ఆయన తాజాగా చెప్పుకొన్నారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించానని, దీంతో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని స్పష్టం చేశారు.

వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇదే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. భారత్ తో ట్రేడ్ డీల్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ట్రేడ్ డీల్ తుదిదశలో ఉందని వివరించారు. దీన్ని ఉపయోగించే భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేసినట్లు చెప్పారు.

వివిధ దేశాలు, రీజియన్ల మధ్య తలెత్తిన యుద్ధాలను పరిష్కరించడంలో తాము అద్భుత విజయాలను సాధించామని ట్రంప్ అన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇంకో వారం గడిచి వుంటే ఈ రెండు దేశాలు అణ్వాయుధాలను వినియోగించేవని వ్యాఖ్యానించారు. క్రమంగా అది అణు యుద్ధంగా మారేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అలా జరిగివుంటే అనేక ఘోర పరిణామాలు తలెత్తేవని, ఊహించని దుష్పరిణామాలు సంభవించేవని, సకాలంలో దానికి అడ్డుకట్ట వేశానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రేడ్ డీల్ ద్వారానే ఆ విజయాన్ని సాధించామని వివరించారు. యుద్ధాన్ని నిలిపివేసేంత వరకు ట్రేడ్ డీల్ గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ చర్చించబోమని హెచ్చరించానని, దీంతో భారత్- పాక్ దిగొచ్చాయని చెప్పారు.

ఈ వ్యాఖ్యలకు భారత్..ఇదివరకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దీన్ని ట్రంప్ పెద్దగా పరిగణనలోకి తీసుకోనట్టుగానే కనిపిస్తోంది. యుద్ధాన్ని నిలిపివేయడంలో ట్రంప్ పాత్ర లేదని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని ఆయన పట్టించుకోవట్లేదు. అవకాశం ఉన్న ప్రతీచోటా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూనే వస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+