నిశీధిలో భారతావని... అంతరిక్షం నుంచి చూస్తే.. ఇలా..
రాత్రిపూట మన దేశం ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ ఫొటోను నాసా శాటిలైట్ ద్వారా అంతరిక్షం నుంచి తీసినది.
న్యూఢిల్లీ: మన దేశం ఎలా ఉంటుందో ఇండియా మ్యాప్ ద్వారా మనకు తెలుసు. కానీ రాత్రిపూట ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ ఫొటో అంతరిక్షం నుంచి తీసినది.
ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' మన దేశానికి సంబంధించి ఎన్నో చిత్రాలు తీసింది. తాజాగా ఓ అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు నిశీధిలో భారతదేశం ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది.

2012లో భారత నైట్ విజన్ ను విడుదల చేసిన నాసా.. తాజా చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ రెండు చిత్రాల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న నగరాలు, వాటి విస్తరణకు సంబంధించి ఈ ఫొటోల ద్వారా తేడా స్పష్టంగా తెలుస్తుంది.
శాటిలైట్ ద్వారా భూమికి సంబంధించి మరింత స్పష్టమైన చిత్రాలను తీసేందుకు కృషి చేస్తున్నట్లు నాసా ఎర్త్ సైంటిస్ట్ మిగుల్ రోమన్ తెలిపారు. దీనికోసం కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications