వారెన్ బఫెట్ వారసుడి రేసులో ముందున్న భారతీయుడు
న్యూయార్క్: అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో భారతీయుడు ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా సత్తా చాటునున్నాడు. స్టాక్ మాంత్రికుడు ప్రపంచ ప్రఖ్యాత ఈక్విటీ ఇన్వెస్టర్‌గా పేరున్న వారెన్ బఫెట్ వ్యాపార సామ్రాజ్య పగ్గాలను భారత్‌కు చెందిన అజిత్ జైన్‌కే దక్కే అవకాశముంది.
84 ఏళ్ల బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హ్యాత్‌వే సంస్థ .. ప్రస్తుతం ఆయన వారసుడిని వెతికే పనిలో ఉంది. ప్రధానంగా జైన్, గ్రెగ్ ఎబెల్ మధ్యే పోటీ ఉంది. అయితే ఈమధ్య సంస్థ ఉద్యోగులకు బఫెట్ రాసిన వార్షిక లేఖలో జైన్‌ను ప్రశంసించిన తీరును బట్టి చూస్తే ఆయన్నే వారసుడిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

ఈ మేరకు విశ్లేషకులు కూడా బఫెట్ వారసుడు జైన్‌నేనని భావిస్తున్నారు. ఒడిశాలో జన్మించిన 63ఏళ్ల జైన్.. ఐఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్లలో విద్యనభ్యసించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన బఫెట్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెర్క్‌షైర్ రీఇన్య్యూరెన్స్ గ్రూప్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications